స్టాలియో మోటార్‌సైకిల్‌ను పునఃప్రవేశపెట్టనున్న మహీంద్రా

మహీంద్రా అండ్ మహీంద్రా తొలిసారిగా అత్యంత గట్టి పోటీ ఉన్న ద్విచక్రవాహన మార్కెట్లోకి స్టాలియో 110 సీసీ మోటార్‌సైకిల్ ద్వారా అడుగు పెట్టింది. హోండా సిబి ట్విస్టర్, టీవీఎస్ స్టార్ సిటీ మోటార్‌సైకిళ్లకు గట్టి పోటీ ఇవ్వాలనే ఉద్దేశంతో కంపెనీ స్టాలియోను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
అయితే మహీంద్రా అండ్ మహీంద్రా మోటార్‌సైకిల్ మార్కెట్లోకి ప్రవేశించే నాటికే హోండా, టీవీఎస్ కంపెనీలు అగ్రస్థానంలో ఉండి మంచి బ్రాండ్ ఇమేజ్‍ను సంపాధించుకొని ఉండటంతో వీటి పోటీ ముందు స్టాలియో నిడబడలేకపోయింది. దానికి తోడు వరుస ఫిర్యాదులు రావడంతో ఈ మోడల్ కాస్తా అటకెక్కింది. ఆ సమయంలో స్టాలియో విక్రయాలను పెంచుకునేందుకు కంపెనీ, ఐదేళ్లు లేదా 50,000 కి.మీ వంటి వివిధ ఆఫర్లను ప్రకటించినా ఫలితం లేకపోయింది. మరి ఇప్పుడు తాజాగా రీఎంట్రీ ఇస్తున్న మహీంద్రా స్టాలియో శభాష్ అనిపించుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే మరి.


Click it and Unblock the Notifications








