135 సీసీ, 150 సీసీ బైక్‌ల అభివృద్ధిపై మహీంద్రా దృష్టి!

ఇప్పటికే మహీంద్రా కంపెనీ 135 సీసీ, 150 సీసీ మోటార్‌సైకిళ్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తుంది.మహీంద్రా కంపెనీ స్వాధీనం చేసుకున్న ఇటాలియన్ కంపెనీ ఇంజన్స్ ఇంజనీరింగ్ కొత్త రేంజ్ మోటార్‌సైకిళ్లకు ఇంజన్లను రూపొందించడంలో మహీంద్రాతో కలిసి పనిచేసే అవకాశాలున్నాయి.
ఇదిలా ఉండగా.. గేర్ బాక్స్ సమస్యలతో అటకెక్కిన స్టాలియో 110 సీసీ మోటార్‌సైకిల్‌ను మహీంద్రా టూవీల్స్ ఈ దీపావళి పండుగ సీజన్ నాటికి పునఃప్రవేశపెట్టనున్న కంపెనీ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిందే. మరోవైపు 250 సీసీను ప్రిమీయం బైక్‌లకు పోటీ ఇచ్చందుకు మహీంద్రా ప్రిమీయం బైక్ 'మోజో' కూడా మార్కెట్లోకి రానుంది. అయితే, స్టాలియో సమస్యల కారణంగా, ఆ మోడల్ ప్రభావం మోజోపై పడుతుందనే ఉద్దేశంతో కంపెనీ దీని విడుదలను వాయిదా వేస్తూ వస్తుంది.


Click it and Unblock the Notifications








