ఏడి స్పీకర్లతో మీ కారును హోమ్ థియేటర్‌గా మార్చేయండి

వాషింగ్టన్ కేంద్రంగా చేసుకొని దేశీయ మార్కెట్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న "ఆడిబిల్ డైనమిక్స్" (ఏడి) అనే కార్ స్పీకర్ల తయారీ సంస్థ విశిష్టమైన ఉత్పత్తులను అందిస్తుంది. ఈ కంపెనీ అందిస్తున్న స్పీకర్లు మనం ఎచుకునే పాటలను బట్టి స్పష్టమైన సంగీతాన్ని అందిస్తాయి. ఈ కంపెనీ భారత్‌లో మొత్తం ఆరు ఉత్పత్తులను అందిస్తుంది.
ఎన్ఆర్ 42, ఎన్ఆర్ 52, ఎన్ఆర్ 62, ఎన్ఆర్ 693, ఎన్ఆర్ 50సి, ఎన్ఆర్ 60సి, ఎన్ఆర్ 124, ఎన్ఆర్ 60.4, ఎన్ఆర్ 100.2 అనే తొమ్మిది మోడళ్లను ఆడిబిల్ డైనమిక్స్ అందిస్తోంది. వీటిల్లో ఎన్ఆర్ 693 స్పీకర్ చెప్పుకోదగినది. ఇది ధరకు తగిన విలువను కలిగి ఉంటుంది. చీప్ అండ్ బెస్ట్‌లో విన సొంపైన సంగీతాన్ని అందిస్తుంది.
ఎన్ఆర్ సిరీస్‌లో లభిస్తున్న 'ఎన్ఆర్ 693' మోడల్ స్పీకర్ 440 వాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉండి కారులో హోమ్ థియేటర్ అనభూతిని అందిస్తుంది. ఇది 6x9 ఇంచ్ 3-వే స్పీకర్ సిస్టమ్. ఇందులో ఉండే విశిష్టమైన ఫీచర్లు:
- యూవీ ట్రీటెడ్ ఎకోటెక్స్ కోన్
- డిబిఆర్ఎస్ రబ్బర్ సరౌండ్
- ఓఈఎమ్ డ్రాప్ రీప్లేస్‌మెంట్ డిజైన్
- రిగిడ్ టూల్డ్ బాస్కెట్ ఫ్రేమ్
- ఇంజనీర్డ్ ఆడియోఫిల్ క్రాసోవర్
- లార్జ్ 66ఎమ్ఎమ్ మిడ్‌రేంజ్
- కోటెడ్ పిఈఐ ట్వీటర్ మెంబ్రాన్
భారత మార్కెట్లో ఈ స్పీకర్ ధర రూ.4,000/- (పన్నులతో కలిపి) మాత్రమే. ఆడిబిల్ డైనమిక్స్ అందిస్తున్న మరిన్ని ఉత్పత్తులకు సంబంధించిన సమాచారం కోసం కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.


Click it and Unblock the Notifications








