గంటకు 502 కి.మీ. వేగంతో ప్రయాణించే హయబుసా బైక్!

Hayabusa
సాధారణంగా ఓ బైక్‌పై ఎంత వేగంతో ప్రయాణించగలం. మామూలుగా అయితే 60-80 కిలోమీటర్ల వేగంతో బైక్‌ను కంఫర్ట్‌గా రైడ్ చేయగలం లేదా మహా అయితే.. గంటకు 150-200 కి.మీ. వేగంతో రైడ్ చేయగలం. కానీ బైక్‌పై ఎవరైనా గంటకు 502 కి.మీ. వేగంతో ప్రయాణించగలరా..!? అసాధ్యం అంటారా..! అయితే, పక్కన ఉన్న ఫోటోను చూడండి, ఇదేదో చిన్న సైజు కారు అని అనుకుంటే పొరపాటే. అలాగని సూపర్‌బైక్ కూడా కాదు. ఇది ఓ సాదాసీదా 1299 సీసీ ఇంజన్ కలిగిన హయబుసా బైక్.

ఫ్లోరిడాకు చెందిన బిల్ వార్నర్ అనే వ్యక్తి ఈ బైక్‌ను టర్బోఛార్జ్‌డ్ మోటార్‌సైకిల్‌గా తీర్చిదిద్ది గంటకు 502 కిలోమీటర్ల (గంటకు 311.945 మైళ్ల) వేగంతో ప్రయాణించి ఓ సరికొత్త రికార్డును సృష్టించాడు. గతంలో అత్యంత వేగంగా ప్రయాణించే బైక్ రికార్డును ఇతను అధిగమించాడు. గతేడాదిలో 'స్ట్రీమ్‌లైనర్' మోటార్‌సైకిల్స్ గంటకు గరిష్టంగా 448.36 కిలోమీటర్ల (గంటకు 278.6 మైళ్ల) వేగంతో ప్రయాణించి రికార్డును నెలకొల్పగా ఆ రికార్డ్‌ను వార్నర్ అధిగమించి మరో కొత్త రికార్డును సృష్టించాడు.

ఈ రికార్డు సృష్టించిన వార్నర్ తన అనుభవాన్ని పంచుకుంటూ.. "ఈ బైక్‌ను 502 కి.మీ. వేగానికి తీసుకువెళ్లడం పెద్ద కష్టమైన పనేం కాదు. అయితే, అంత వేగంలో వెళ్లే ఈ బైక్‌ వేగాన్ని తగ్గించడమే పెద్ద కష్టం, ఇది పూర్తిగా ఆగిపోయే లోపలే నేను రన్‌వే దాటి వెళ్లిపోయాన"ని అన్నారు.

More from DriveSpark

Article Published On: Friday, July 29, 2011, 17:42 [IST]
English summary
Land speed records are always set to be broken. But here is one record that might stick to the record books for a long long time. Bill Warner, a resident of Florida, USA has set a new speed record while riding a turbocharged Suzuki Hayabusa. He has set a record top speed of 311.95mph (502km/h) at the Loring Air Force Base in Maine, USA.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+