హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌ను కొన్న రెండవ ఇండియన్ లేడీ..

Harley Davidson
హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌లను రైడ్ చేయాలంటే గట్స్ కావాలి, అలాగే వాటిని కొనుగోలు చేయాలన్నా భారీగా నగదు కావాలి. ఇంచు మించు మిడ్-సైజ్ సెడాన్ కారు ధర కలిగే ఉండే ఈ బైక్‌లను హై-ఎండ్ ప్రొఫైల్ కలిగిన సెలబ్రిటీల వంటి వాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తుంటాం. ప్రత్యేకించి మగవారి కోసం రూపొందించిన మోటార్‌సైకిళ్లు, అధిక పవర్ కలిగిన బైక్‌లపై ఇప్పుడు ఆడవాళ్లు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇటీవలే బెంగుళూరుకు చెందిన ఓ హెచ్ఆర్ ప్రొఫెషనల్ షీజా మాథ్యూస్ ఇండియాలో హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌ను కొనుగోలుచేసిన తొలి మహిళగా వార్తల్లోకెక్కారు.

అయితే, ఇప్పుడు తాజాగా ఈ జాబితాలోకి మరో మహిళ చేరిపోయింది. హైదరాబాద్‌కు చెందిన 33 ఏళ్ల ఆర్కిటెక్ట్ కస్తూరీ డియోధర్ భారత్‌లో హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌ను కొనుగోలుచేసిన రెండవ మహిళగా వార్తల్లో నిలిచారు. "మరింత మంది మహిళలు హ్యార్లీను రైడ్ చేయడానికి ఇష్టపడుతారని నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను ఈ బైక్‌ను రైడ్ చేస్తున్నప్పుడు చాలా మంది ప్రజలు నన్నేచూస్తుండిపోయార"ని డియోదర్ తెలిపారు.

అమెరికాకు చెందిన ప్రముఖ కల్ట్ బైక్‌ల తయారీ సంస్థ అయిన హ్యార్లీ డేవిడ్‌సన్ భారత్ మార్కెట్లో అందిస్తున్న "ఐరన్ 883" బైక్‌ను డియోధర్ కొనుగోలు చేశారు. షీజా మాథ్యూస్ కూడా ఇదే మోడల్ బైక్‌ను కొనుగోలు చేశారు. దీని ధర రూ. 6.5 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా ఉంది. డియోధర్ భర్త ఈ బైక్‌ను ఆమెకు బహుమతిగా ఇచ్చారు. హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌ వాడటానికి ముందు యమహా రాజ్‌ధూత్ 350 బైక్‌ను, దానికి ముందుకు బజాజ్ ఎలిమేనేటర్ బైక్‌లను ఉపయోగించే వాళ్లమని డియోధర్ తెలిపారు.

More from DriveSpark

Article Published On: Wednesday, July 20, 2011, 10:40 [IST]
English summary
Hyderabad-based 33-year-old architect Kasthuri Deodhar has become the second woman to own a Harley Davidson in India after Bangalore's HR professional Sheeja Mathews.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+