విదేశీ శిరస్త్రాణాలను ధరించినా జరిమానా తప్పదు!!

తప్పని హెల్మెట్ ధరించాల్సిందే, లేకపోతే సర్కారుకు జరిమానా కట్టక తప్పదు. ఇదంతా సరే కానీ.. కేవలం హెల్మెట్ ధరించాలనే నిబంధనం కోసం మాత్రమే ఏ హెల్మెట్ పడితే ఆ హెల్మెట్ ధరించడానికి వీల్లేదు. మీరు ధరించే హెల్మెట్ తప్పనిసరిగా ఐఎస్ఐ (ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యషన్) సర్టిఫై చేసిన హెల్మెట్లను మాత్రమే వాడాలి. ఫ్లాట్‌ఫామ్ మీద విక్రయించేవి లేక నకిలీ హెల్మెట్లను వాడుతూ పోలీసుల చేతికి చిక్కితే, మీ జేబుకు చిల్లు ఖాయం.
నకిలీవే కాదండోయ్, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవి, విదేశీ స్టాండర్డ్స్ ప్రకారం సర్టిఫై చేసిన హెల్మెట్లను ఉపయోగించినా సరే జరిమానా కట్టాల్సిందే. ఇలాంటి ఓ విచిత్రమైన సంఘటనే ముంబైలో చోటు చేసుకుంది. ముంబైలోని ద్విచక్ర వాహన చోదకులు అమెరికన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ (డాట్), ఆస్ట్రేలియన్, ఇటాలియన్ అథారిటీలు సర్టిఫై చేసిన హెల్మెట్లు ఉపయోగిస్తున్న వారికి జరిమానాలు విధించారు.
వీరిలో సాధారణ బైక్‌లు నడిపే వారి నుండి హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌లు నడిపే వారి వరకూ ఇలా వందల మంది వాహన చోదకులకు పోలీసు అధికారులు జరిమానాలు విధిస్తుండటంతో అందరూ కట్టగట్టుకొని ముంబై ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌ను ఆశ్రయించారు. విదేశీ హెల్మెట్లను అనుమతించాలని వారంతా అధికారులను అభ్యర్థించారు. వాస్తవానికి వీరు ఉపయోగిస్తున్న హెల్మెట్లు భారత్‌లో లభ్యమయ్యే హెల్మెట్ల కన్నా ఎంతో మెరుగైనవి.
ఒరిజిల్ హెల్మెట్లను, నకిలీ హెల్మెట్లను పోల్చుకోవడంలో కాస్తంత తికమకపడిన పోలీసులు ఐఎస్ఐ మార్కు ఉంటేనే వాటిని సరైన హెల్మెట్లుగా పరిగణిస్తున్నారని, కేవలం ఐఎస్ఐ గుర్తు ఉంటేనే అవి సరైనవి గానూ, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిన హెల్మెట్లను నకిలివీగానూ భావిస్తున్నారని ద్విచక్ర వాహన యజమానులు చెబుతున్నారు. అయితే, పోలీసులు వాహన చోదకుల రక్షణ మేరకే తాము ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications








