డిసెంబర్‌లో కొత్త పల్సర్‌ను విడుదల చేయనున్న బజాజ్

ఈ విషయంపై బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ స్పందిస్తూ.. "మేము తొలి పల్సర్‌ను నవంబర్ 2001లో విడుదల చేశాం. ప్రస్తుతం సరికొత్త ఇంజన్ టెక్నాలజీతో రూపొందించిన సరికొత్త బైక్‌ను రూపొందించాం, దీవి విడుదలకు మేము 100 శాతం సిద్ధంగా ఉన్నాం. నిజంగా ఇది డిటిఎస్-ఐ టెక్నాలజీ తర్వాత మరో పెద్ద స్టెప్" అని ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పారు.
రాజీవ్ బజాజ్ ప్రకారం, ఈ టెక్నాలజీ ప్రపంచంలోనే మరెక్కడా లేదు మరియు త్వరలోనే ఇది కంపెనీ అందిస్తున్న పల్సర్, డిస్కవర్ రేంజ్ బ్రాండ్‌లలో భాగం కానుంది. కాగా.. కొత్త బజాజ్ పల్సర్‌తో పాటుగా ఆస్ట్రియన్ స్పోర్ట్ బైక్‌ల తయారీ సంస్థ కెటిఎమ్‌తో చేతులు కలిపి బజాజ్ అభివృద్ధి చేస్తున్న కెటిఎమ్ డ్యూక్ 200 ఆఫ్-రోడ్ బైక్‌ను కంపెనీ డిసెంబర్ నెలలో ఆవిష్కరించనుంది.


Click it and Unblock the Notifications








