బాక్సర్ విడుదలతో బజాజ్ విక్రయాలు 50 లక్షలకు జంప్..!

వచ్చే నెలలో విడుదల చేయనున్న బాక్సర్ 150 సీసీ (భారత్ బైక్) బైక్‌తో విక్రయాలు ఒక్కసారిగా ఊపందుకుంటాయని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ వెల్లడించారు. అలాగే, పల్సర్, డిస్కవర్ బ్రాండ్‌లు కూడా మునుముందు మరింత వృద్ధిని కనబరచగలవని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 2009-10 ఆర్థిక సంవత్సరంలో 28 లక్షల యూనిట్లను, 2010-11 ఆర్థిక సంవత్సరంలో 38 లక్షల యూనిట్లను విక్రయించాని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 50 లక్షల యూనిట్లను లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. కంపెనీ ఇంత వృద్ధి సాధించడానికి డిస్కవర్ బ్రాండే కారణమని బజాజ్ ఆటో భావిస్తోంది. ప్రస్తుతం ఇది మూడు (100సీసీ, 125సీసీ, 150సీసీ) ఇంజన్ వేరియంట్లలో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








