మల్టీ కలర్ ఆప్షన్‌తో బజాజ్ పల్సర్ 220 సీసీ స్పోర్ట్స్ బైక్!

అంటే పల్సర్ 220 సీసీ బైక్ ఇకపై డబుల్ కలర్ ఆప్షన్‌తో లభ్యం కానుంది. బ్లాక్ అండ్ రెడ్ కలయిక మరియు బ్లాక్ అండ్ బ్లూ కలయికలతో వస్తున్న ఈ బైక్‌లు పల్సర్ ప్రియులను మరింత ఆకట్టుకోనున్నాయి. బ్లాక్ అండ్ రెండ్ డ్యూయెల్ టోన్ పల్సర్‌ను చిత్రంలో చూడొచ్చు. ఈ కొత్త కలర్ పల్సర్ ఆగస్ట్ లేదా సప్టెంబర్ నెలలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఉన్న పల్సర్ 220 సీసీ బైక్‌ల స్టాక్‌ను క్లియర్ చేసుకున్న తర్వాత ఈ కొత్త మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. కాగా.. ఇదే సమయానికి పల్సర్ బ్రాండ్‌లో ఓ కొత్త 250 సీసీ ఇంజన్ వేరియంట్ బైక్ కూడా విడుదలయ్యే ఆస్కారం ఉంది. మరి పల్సర్ 220 సీసీ బైక్ కొత్త గ్రాఫిక్స్ మీకు నచ్చిందా.. మీ అభిప్రాయాలను మా రీడర్లతో పంచుకోండి..!


Click it and Unblock the Notifications








