బజాజ్ పల్సర్ కొత్త లుక్ ఇదేనా..?

సరే ఇదంతా అటుంచి అసలు విషయానికి వస్తే.. ప్రస్తుతం బజాజ్ అందిస్తున్న పల్సర్ బైక్‌కు కొన్ని అదనపు హంగులు అద్ది, మరింత ఆకర్షనీమైన స్పోర్టీ లుక్‌తో త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో కనిపిస్తున్న బజాజ్ పల్సర్ బైక్‌ను గమనిస్తే.. ఇదే అప్‌గ్రేడెడ్ పల్సర్ స్పోర్ట్స్ బైక్ అయి ఉండవచ్చనే అనుమనాలు తలత్తెతున్నాయి.
గతంలో బజాజ్ ఓ అప్‌గ్రేడెడ్ పల్సర్ బైక్‌ను విడుదల చేస్తామని ప్రకటించింది. ఇది 250 సీసీ ఇంజన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. భారత్‌లో మరో అతిపెద్ద స్పోర్ట్ బైక్‌ల అమ్మకపుదారు అయిన, జపాన్ టూ-వీలర్ కంపెనీ యమహానే ఈ ఫోటోను తమ ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజ్‌లో పోస్ట్ చేసింది. "మీ శత్రువును తక్కువగా అంచనా వేయకండి" అనే సందేశాన్ని జోడించి యమహా ఈ చిత్రాన్ని పోస్ట్ చేసింది.
ఈ చిత్రాన్ని బట్టి గమనిస్తే.. ఇది కొత్త ఇంజన్ కవర్‌ను కలిగి ఉండి ఫ్రంట్ అండ్ రియర్ డిజైన్‌లలో మార్పులను స్పష్టంగా తెలియజేస్తుంది. యమహా తాజాగా ప్రవేశపెట్టిన ఆర్ 15 వెర్షన్ 2.0 బైక్‌ను ఇమిటేట్ చేస్తున్నట్లుగా ఉండే స్ప్లిట్ సీట్ కూడా మరో ప్రత్యేక ఆకర్షనగా నిలువనుంది. కొత్త నలుపు రంగు ప్లాస్టిక్‌తో రీడిజైన్ చేయబడిన హెడ్ ల్యాంప్, చైన్ గార్డ్ లేకపోవడం కూడా ఇందులో ఇతర మార్పులు. అంటే.. త్వరలోనే మనం ఓ సరికొత్త పల్సర్‌ను రోడ్లపై చూడబోతున్నామన్నమాట.


Click it and Unblock the Notifications