జూన్ నెల నుంచి హీరోహోండా బైక్‌లపై 'హోండా' మిస్...!!

ఇప్పటి వరకూ స్ప్లెండర్ ప్రపంచవ్యాప్తంగా ఒక కోటి మోటార్ సైకిళ్లు అమ్ముడయ్యి రికార్డు సృష్టించాయి. ప్యాషన్ కూడా దాదాపు అంతే సంఖ్యలో అమ్ముడయ్యాయి. హీరోహోండా కంపెనీ మొత్తం విక్రయాలలో ఈ రెండు మోడళ్లే 45 శాతం అమ్ముడవుతున్నాయంటే వీటికున్న క్రేజ్ ఏంటో ఇట్టే అర్థమవుతుంది. రెండు కంపెనీల కలయిక (హీరో గ్రూప్ మరియు హోండా మోటార్) వల్ల ఏర్పడి అత్యంత ప్రాచుర్యం పొందిన హీరోహోండా కంపెనీ మరికొద్ది రోజుల్లోనే విడిపోనున్న సంగతి తెలిసిందే. భాగస్వామ్య రద్దుకు సంబంధించిన కార్యకలాపాలు కూడా సజావుగా జరుగుతున్నట్లు కంపెనీ అధికారి ఒకరు వెల్లడించారు.
అయితే.. హీరో గ్రూప్ భారత్‌కు చెందిన కావడమే కాకుండా.. దేశంలో స్వతహాగా ఉత్పత్తి కేంద్రాలను, భారీ డీలర్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. కానీ హోండా విషయానికి వస్తే.. ఇది జపాన్‌కు చెందిన అనుబంధ కంపెనీ కావడమే కాకుండా.. కంపెనీ పోర్ట్‌ఫోలియో (ఉత్పత్తుల) విషయంలో కూడా భారత మార్కెట్లో వెనుకబడి ఉంది. ప్రస్తుతం హోండా భారత్‌లో అందిస్తున్న ఉత్పత్తులలో యునికార్న్, ఆక్టివాలు మాత్రమే ఎక్కువగా ప్రజాదరణ పొందాయి. ఇకపై ఈ రెండు కంపెనీలు ఎవరికి వారు కొత్త మోడళ్లను మార్కెట్లో ప్రవేశపెడితే వినియోగదారులు ఎంత మేరకు ఆదరిస్తారో.. అలాగే ఎవరు ప్రపంచ నంబర్ వన్‌గా నిలుస్తారో.. కాలమే నిర్ణయించాలి.


Click it and Unblock the Notifications








