మీ కారు టైరులో పంక్చర్ కిల్లర్ ఉందా..?
ఇది పంక్చర్లు కావడం, లేదా పంక్చర్లు అయినప్పుడు ఎయిర్ లీక్ కావడాన్ని నియంత్రిస్తుంది. మేకులు వంటివి గుచ్చుకుని టైరు / ట్యూబ్ పంక్చర్ అయినప్పుడు ఆ రంధ్రం లోనికి ఈ లిక్విడ్ (జెల్) వెళ్లి, రంధ్రం గుండా వెలువడే గాలి పీడన తీవ్రతకు జెల్ గట్టిపడి రంధ్రాన్ని శాశ్వతంగా మూసివేస్తుంది. ఫలితంగా ట్యూబులోని గాలి బయటకు రాకుండా ఉంటుంది.
పంక్చర్ కిల్లర్ యొక్క మరిన్ని విశిష్టతలు:
* పంక్చర్, లీక్‌ల నుండి టైర్‌ను రక్షిస్తుంది.
* బెస్ట్ క్వాలిటీ టైరీ సీలెంట్.
* పంక్చర్ కిల్లర్ టైరు జీవిత కాలాన్ని (లైఫ్) పెంచుతుంది.
* మైలేజ్ పెరగడానికి పంక్చర్ కిల్లర్ తోడ్పడుతుంది.
* సాధారణ టైర్‌ను పంక్చర్ ప్రూఫ్ టైర్‌గా మారుస్తుంది.
* ఒక్కసారి ఇన్‌స్టాల్ చేసుకుంటే టైర్ జీవిత కాలం వరకూ మార్చుకోవాల్సిన అవసరం లేదు.
* ధీర్ఘకాలం పాటు టైరు లోపల స్థిరమైన వాయు పీడనాన్ని కలిగి ఉంటుంది.
* పంక్చర్ కిల్లర్ పర్యావరణ సురక్షితమైనది, ఇది టైరుకు ఎలాంటి హాని కలిగించదు.
వన్ఇండియా ఆటోమొబైల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ను సంప్రదించి సేకరించిన సమాచారం ప్రకారం, ఒక కారు యొక్క నాలుగు టైర్ల కోసం 1లీటరు పంక్చర్ కిల్లర్ లిక్విడ్ (జెల్) అవసరమవుతుంది. అదే టూ-వీలర్‌కు అయితే, సుమారు 600 మి.లీ. లిక్విడ్ అవసరమవుతుంది. ఇక దీని ధర విషయానికి వస్తే 1లీటరు పంక్చర్ కిల్లర్ లిక్విడ్ సుమారు రూ.1,399/- గా ఉంటుందని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. పంక్చర్ కిల్లర్ జెల్‌కు సంబంధించిన మరిన్ని వివరాలకు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.


Click it and Unblock the Notifications









