ప్రస్తుతానికి స్కూటర్లు లేవ్.. బైక్‌ల పైనే దృష్టి: రాజీవ్ బజాజ్

బజాజ్ స్కూటర్లను తిరిగి భారత రోడ్లపై చూడాలనుకునే వారి కల కలగానే మిగిలేలా ఉంది. స్కూటర్ల తయారీలో తమదైన ముద్రవేసుకొని భారత ప్రజల చేత "హమారా బజాజ్" అనిపించిన బజాజ్ స్కూటర్లను తిరిగి ప్రవేశపెట్టాలనుకు రాహుల్ బజాజ్ (బజాజ్ ఆటో వ్యవస్థాపకుడు) ఆలోచన కార్యరూపం దాల్చలేకపోతుంది. ప్రస్తుతానికి స్కూటర్ల తయారీపై దృష్టి సారించడంలేదని రాజీవ్ బజాజ్ (రాహుల్ బజాజ్ తనయుడు) తేల్చి చెప్పేశారు. మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా ముందుకు సాగడమే తన ధ్యేయమని రాజీవ్ చెప్పారు. ఈ విషయంపై తండ్రి, తనయుల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తుతున్నాయి.

ప్రస్తుతం ప్రపంచ మార్కెట్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టాలని రాజీవ్ భావిస్తున్నారు. రాజీవ్ ఆలోచన చూస్తుంటే.. ప్రస్తుతం ప్రపంచ నంబర్ వన్‌గా ఉన్న హీరోహోండా స్థానాన్ని బజాజ్ ఆక్రమించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. పైపెచ్చు హీరోహోండా రెండు కంపెనీలుగా విడిపోనున్న సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్లో స్కూటర్ల తయారీదారులతో పోటీపడటం కన్నా ప్రపంచ మార్కెట్లో ఉన్న వివిధ మోటార్‌సైకిల్ తయారీదారులతో పోటీపడమే ఉత్తమమని రాజీవ్ భావిస్తున్నట్లు సమాచారమ్.

స్కూటర్ విభాగంలోకి తిరిగి ప్రవేశించి 20 శాతం మార్కెట్ వాటాను, ఈబిఐటిడిఏలో ఓ మార్జినల్ షేర్‌ను ఆర్జించాలని భావిస్తున్నట్లు ఇటీవల రాహుల్ బజాజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తుది నిర్ణయాన్ని మాత్రం ఆయన రాజీవ్‌ బజాజ్‌కే వదిలేశారు. ప్రస్తుతం గేర్‌లెస్ స్కూటర్ల సెగ్మెంట్‌లో హోండా అగ్రగామిగా ఉంది. అలాగే బజాజ్ అందిస్తున్న పల్సర్, డిస్కవర్ వాహనాలకు మార్కెట్ నుంచి భారీ స్పందన వస్తుండటంతో పాటు ద్విచక్రవాహన విభాగంలో గట్టి పోటీ ఏర్పడంటతో ఈ విభాగంలో తమస్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు బజాజ్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఏదైతేనేం మరోసారి హమారా బజాజ్‌ అనాలకున్నవారి ఆశలు నిరాశలుగానే మిగిలిపోనున్నాయి. మీ అభిప్రాయాలను కింద ఇచ్చిన కామెట్ బాక్స్‌లో మాతో పంచుకోండి.

More from DriveSpark

Article Published On: Wednesday, February 16, 2011, 13:40 [IST]
English summary
The twist of fortunes hangs on Bajaj Auto with the father and son having different approaches to the relaunch of scooters. While the senior Bajaj wants the foray into the scooters again, the MD Rajiv Bajaj put an end to such speculations. He clarified that the need of the hour is to focus on the global market and not on the revival of scooters.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+