మోటార్ ఇన్సూరెన్స్‌లకు నామినీ తప్పనిసరి: ఐఆర్‌డిఏ

Insurance Nominee
సాధారణ జీవిత భీమాలకు నామినీని పేర్కొనడం తప్పనిసరి అయినట్లుగానే, ఇకపై మోటార్ బీమాలకు కూడా నామినీని పేర్కొనడం తప్పనిసరి చేస్తూ బీమా నియంత్రణ మరియు అభివృద్ధి మండలి (ఐఆర్‌డిఏ) ఓ నిర్ణయాన్ని తీసుకుంది. క్లెయింట్లలో తలెత్తున్న ఇబ్బందులను పరిష్కరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐఆర్‌డిఏ వెల్లడించింది.

ఈ మేరకు అన్ని బీమా సంస్థలకు ఐఆర్‌డిఏ ఓ లేఖను కూడా పంపింది. దీని ప్రకారం, ఇకపై అన్ని ప్రైవేటు వాహనాలకు బీమా చేయించేటప్పుడు బీమా పత్రంలో నామినీ పేరును నమోదు చేయడం తప్పనిసరి. ఒకవేళ ప్రమాదం కారణంగా పాలసీదారుడు మరణించినట్లయితే, సదరు పాలసీదారుని నామినీకు నేరుగా క్లెయిమ్‌ను చెల్లించే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారం, బీమా కంపెనీలు చట్టప్రకారం పాలసీదారుని యొక్క వారుసులకు ఈ క్లెయిమ్‌ను చేయడం జరుగుతోంది. మొత్తం నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ వ్యాపారంలో దాదాపు 45 శాతం మోటార్ ఇన్సూరెన్స్‌లే ఉన్నాయి. ఐఆర్‌డిఏ తీసుకున్న తాజా నిర్ణయాన్ని బీమా కంపెనీలు స్వాగతిస్తున్నాయి.

అయితే వీటి ప్రీమియం రేట్లు ఇప్పటికీ ఐఆర్‌డిఏ నియంత్రణలోనే ఉండటంతో బీమా కంపెనీలు నష్టాలను చవిచూస్తున్నాయి. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఈ నష్టం రూ.3,500 కోట్లను తాకవచ్చని అంచనా. కాబట్టి ఇకపై మీరు కొత్త వాహనానికి ఇన్సూరెన్స్ చేయించినా లేదా ఇన్సూరెన్స్‌లను రెన్యువల్ చేయించినా నామినీ పేరును నమోదు చేయడం మర్చిపోకండి..!!

More from DriveSpark

Article Published On: Wednesday, November 9, 2011, 15:50 [IST]
English summary
In order to streamline settlement of claims by insurance companies, the regulator Irda has made it mandatory for persons seeking motor insurance to mention the name of nominee at the time of buying the policy.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+