అరెరె.. ఈ మోటార్‌బైక్‌కి సీట్ లేదేంటి..!?

ఈ బైక్ పేరు "ఒస్సా టిఆర్ 280ఐ" (OSSA TR 280i) ప్రత్యేకించి ఆఫ్-రోడింగ్ ప్రయోజనం కోసం ఈ బైక్‌ను ఉపయోగిస్తారు. కొండలు, గతుకుల రోడ్లపై ఈ బైక్‌ను ఉపయోగిస్తారు. వాస్తవానికి వీటిని ఎక్కువగా మోటార్ స్పోర్ట్ ఈవెంట్లలో ఉపయోగిస్తుంటారు. ఎఫ్1 రేసుల మాదిరిగానే వివిధ ప్రమాదకరమైన స్టంట్‌లు కలిగిన ట్రాక్‌పై వీటిని నడుపుతుంటారు.
ఒస్సా ఇంజనీర్లు రెండేళ్ల పాటు శ్రమించి ఈ మోటార్‌బైక్‌ను ఆత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. ఇందులో ఎలక్ట్రానిక్-ఇంజెక్షన్ సిస్టమ్ కలిగిన టూ-స్ట్రోక్ ఇంజన్‌ను ఉపయోగించారు.


Click it and Unblock the Notifications








