హీరో గ్రూప్, హోండా మోటార్‌ల ఒప్పందం రద్దు

అయితే ఈ జేవీ నుండి విడిపోయిన తర్వాత కూడా.. హీరో హోండా మోటార్ తమ ఉత్పాదనలను అన్నింటినీ భారత మార్కెట్లో కొనసాగించనుంది. గడచిన 26 ఏళ్లుగా చెరి 26 శాతం వాటాతో హీరో హోండా జాయింట్ వెంచర్‌ను నిర్వహిస్తూ.. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా టూ వీలర్‌లను విక్రయిస్తున్న కంపెనీగా హీరో హోండా ఎదిగిన సంగతి తెలిసిందే.
అప్పట్లో కుదుర్చుకుని తదుపరి పొడిగిస్తూ వచ్చిన ఇరు కంపెనీల ఎంఒయు (అవగాహన ఒప్పందం) రద్దయిపోయిందని బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీకి హీరో హోండా మోటార్స్ తెలియజేసింది. దీంతో సోమవారం నాటి స్టాక్ మార్కెట్ సెషన్‌లో సెన్సెక్స్ లాభాల్లో నడుస్తున్నప్పటికీ హీరో హోండా ఈక్విటీ విలువ అరశాతానికి పైగా పడిపోయి 1,746.50 రూపాయల వద్ద కొనసాగింది.


Click it and Unblock the Notifications








