తమిళనాడులో రూ. 4,000 కోట్లతో ప్యూజో సిట్రాన్ ప్లాంట్

Jayalalitha
ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ పిఎస్‌ఏ ప్యూజో సిట్రాన్ భారత్‌లో తమ కార్ల తయారీ ప్లాంటు కోసం చివరకు తమిళనాడు రాష్ట్రాన్ని ఎన్నుకుంది. తమిళనాడులో 4,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఓ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఈ ప్లాంటు ఏర్పాటుతో ప్యూజో కూడా బిఎమ్‌డబ్ల్యూ, హ్యుందాయ్, ఫోర్డ్, రీనాల్ట్-నిస్సాన్ వంటి ఆటోమొబైల్ దిగ్గజాల సరసన చేరిపోనుంది. తమిళనాడులోని శ్రీపెరంబూర్‌ ప్రాంతంలో కొంత స్థలాన్ని కంపెనీ గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. దేశీయ మరియ విదేశీయ మార్కెట్ల కోసం ప్రారంభ దశలో సాలీనా 3 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసే ప్లాంటును ఆ స్థలంలో ఏర్పాటు చేయాలని కంపెనీ భావిస్తోంది.

ప్లాంటు ఏర్పాటు కోసం వివిధ రాష్ట్రాలను పరిశీలించిన కంపెనీ చివరకు తమిళనాడులోని శ్రీపెరంబూరు ప్రాంతాన్ని ఎంచుకుంది. పూర్తిగా 100 శాతం అనబంధ సంస్థను ఇక్కడ ఏర్పాటు చేయనున్నట్లు ఓ అధికారిక ప్రకటన వెలువడింది. ఈ ప్లాంటు ద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా 20,000 మంది ఉపాధి లభించనుంది. అంతేకాకుండా ఫ్రాన్స్ నుంచి అధిక సంఖ్యలో విడిభాగాల తయారీదారులను కూడా ఈ ప్లాంటు ఆకర్షించనుంది. పిఎస్ఏకు చెందిన ఉన్నతాధికారుల బృందం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో భేటీ అయ్యారు. తమ ప్లాంటు ఏర్పాటు కోసం తమిళనాడును ఎన్నుకుందుకు పిఎస్ఏ ఎగ్జిక్యూటివ్‌లకు ఆమె ధన్యవాదములు తెలిపారు. ఈ ప్రాజెక్టు తమ ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు.

More from DriveSpark

Article Published On: Wednesday, June 29, 2011, 18:07 [IST]
English summary
France carmaker PSA Peugeot Citroen (PSA) is finalising plans to set up their first car manufacturing plant in Tamil Nadu at an investment of Rs 4,000 crore. Company has identified land at Sriperumbudur to set up a plant with an initial capacity of three lakh cars per year, catering to the domestic and overseas market.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+