సూపర్‌బైక్ 'ఆప్రిలియా ఆర్ఎస్‌వి4'ను విడుదల చేసిన పియాగియో

Piaggio Aprilia
ఇటాలియన్ ఆటోమొబైల్ సంస్థ పియాగియో మరోసారి భారత మార్కెట్లో సంచలనం సృష్టించనుంది. భారత బైక్ లవర్స్ కోసం పియాగియో ఓ సరికొత్త హైపవర్ సూపర్ బైక్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదలచేసింది. "ఆప్రిలియా ఆర్ఎస్‌వి 4 ఫ్యాక్టరీ" అనే హైఎండ్ వేరియంట్‌తో పాటు "వెస్పా ఎల్ఎక్స్ 125" స్కూటర్‌ను కూడా పియోగియో విడుదల చేసింది. గడచిన ఆరేళ్లుగా పియోగియో భారత్‌లో వివిధ రకాల ఉత్పత్తులను పరిచయం చేస్తూ.. తమ కార్యకలాపాలను కొనసాగిస్తూ వస్తుంది. గత రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఆధునిక మోటార్ సైకిల్ విభాగంలో ఆప్రిలియా తన విజయకేతనాన్ని ఎగురవేస్తూ వస్తుంది.

సూపర్ బైక్‌ల విభాగంలో ఆప్రిలియా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ఓ చిహ్నంగా నిలిచింది, ఫలితంగా కంపెనీ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. ఇప్పటి వరకూ ఆప్రిలియా 45 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో గెలిచి రికార్డు సృష్టించిది. అందులో 36 స్పీడ్ మోటార్‌సైకిల్ రేసింగ్, రెండు సూపర్‌బైక్, రెండు ట్రయల్, ఐదు సూపర్‌మోటార్డ్ విభాగాల్లో సాధించింది. అంతేకాకుండా.. ప్రపంచ ఛాంపియన్‌షిప్ మోటార్‌సైకిల్ రేసింగ్‌లలో అత్యంత విజయవంతమైన ఇటాలియన్, యూరోపియన్ తయారీదారుగా కూడా ఖ్యాతి గడించింది. గతేడాది జరిగిన ప్రపంచ ఎస్‌బికె ఛాంపింయన్‌షిప్‌లో కూడా రైడర్స్ టైటిల్, కంస్ట్రక్టర్ టైటిళ్లను ఆప్రిలియా సొంతం చేసుకుంది.

ఆప్రిలియా సూపర్‌బైక్ విశేషతలు మీ కోసం..

మోడల్ టైప్ - స్పోర్ట్
ఇంజన్ టైప్ - వీ-4
సిలిండర్స్ - 4
ఇంజన్ స్ట్రోక్ - 4-స్ట్రోక్
ఇంజన్ సీసీ - 999.6 సీసీ
ఇంజన్ హార్స్ పవర్ - 180 హెచ్‌పి
ఇంజన్ కూలింగ్ టైప్ - లిక్విడ్ కూలింగ్
స్టార్టర్ - ఎలక్ట్రిక్ స్టార్ట్
ఫ్యూయెల్ (ఇంధనం) టైప్ - గ్యాస్
ట్రాన్సిమిన్ టైప్ (గేర్లు) - మాన్యువల్, ఆరు గేర్లు
ముందు టైర్ వీల్ బేస్ - 120/70 జెడ్ఆర్17
వెనుక టైర్ వీల్ బేస్ - 190/50 జెడ్ఆర్17
ముందు బ్రేక్ టైప్ - డ్యూయల్ హైడ్రాలిక్ డిస్క్
వెనుక బ్రేక్ టైప్ - హైడ్రాలిక్ డిస్క్

More from DriveSpark

Article Published On: Saturday, January 29, 2011, 12:44 [IST]
English summary
The Italian sensation has swung into India with the unveiling of Piaggio's Aprilia RSV 4 FACTORY super bike and Vespa LX 125 scooter. This would really pulsate the super riders across the country and Piaggio's presence in all these 6 years in India is further enhanced with these products. The Aprilia is on the winning streak for more than two decades and has become a legend in modern motorcycling globally.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+