పియాగ్గియో నుంచి వెస్పా స్కూటర్, ప్రీమియం బైక్స్

Vespa Scooter
వెస్పా స్కూటర్లను తిరిగి భారత మార్కెట్లో పునఃప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ పియాగ్గియో, ప్రస్తుతం స్కూటర్ల ఉత్పత్తిని రెట్టింపుచేసే పనిలో ఉంది. అంతేకాకుండా ఈ ఏడాది ఆరంభంలో ముంబైలో ప్రదర్శించిన ప్రీమియం మోటార్‌సైకిళ్లను కూడా పియోగ్గియో భారత్‌కు తీసుకురానుంది. వృద్ధి చెందుతున్న భారత ఆటోమొబైల్ మార్కెట్లోని స్కూటర్ సెగ్మెంట్లో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని, కాబట్టి ప్రస్తుతం ఏటా 1.5 లక్షల యూనిట్లుగా ఉన్న వెస్పా స్కూటర్ల ఉత్పత్తిని 2013 ప్రథమార్థం నాటికి 3 లక్షల యూనిట్లకు పెంచనున్నామని పియోగ్గియో వెహికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రవి చోప్రా తెలిపారు.

అలాగే, అప్పర్ ఎండ్ మోటార్‌సైకిళ్ల మార్కెట్లో వృద్ధిని గమనిస్తున్నామని, ఎంట్రీ లెవల్ లేదా ఎకానమీ సెగ్మెంట్లలోని మోటార్‌సైకిళ్ల కన్నా కూడా ఎగ్జిక్యూటివ్ మరియు ప్రీమియం సెగ్మెంట్లలోని మోటార్‌సైకిళ్లలోనే అధికంగా వృద్ధి ఉందని, కాబట్టి ఈ వృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఈ సెగ్మెంట్లలో తమ అప్పర్ ఎండ్ బైక్‌లను ప్రవేశపెట్టేందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. కాగా.. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నాటికి వెస్పా స్కూటర్ల అమ్మకాలు ప్రారభించాలని నిర్ణయించామని రవి చోప్రా తెలిపారు. ఇప్పటి వరకూ ఈ స్కూటర్ల ప్లాంటు కోసం కంపెనీ 30 మిలియన్ల యూరోల పెట్టుబడులను వెచ్చించింది.

More from DriveSpark

Article Published On: Friday, August 5, 2011, 14:57 [IST]
English summary
As scooters demand is increasing in India, Piaggio plans to double its scooter production to address the volume in this segment. Company said, they are ahead of schedule and could even start selling Vespa Scooter by February-March 2012.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+