మార్చి నాటికి మార్కెట్లోకి రానున్న వెస్పా 125సీసీ స్కూటర్

Vespa Scooter
భారతదేశపు త్రిచక్ర వాహన తయారీ సంస్థ పియాజ్జియో తరిగి స్కూటర్ల విభాగంలోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. వచ్చే ఏడాది మార్చి నాటికి సరికొత్త 'వెస్పా' స్కూటర్‌ను దేశీయ వినియోగదారులకు పరిచయం చేయనుంది. కేవలం స్కూటర్ల విభాగానికి మాత్రమే పరిమితం కాకుండా.. ప్రస్తుతం అత్యంత పోటీకరమైన మోటార్‌‌సైకిల్ మార్కెట్‌లోకి కూడా ప్రవేశించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

యాజియో వెహికల్స్‌ ఛైర్మన్‌ మరియు మేనేజింగ్ డైరెక్టర్ రవి చోప్రా ఢిల్లీలో జరిగిన ఆటోమోటివ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ (ఏసిఎమ్ఏ) సదస్సులో మాట్లాడుతూ.. "వెస్పా స్కూటర్‌ను పనఃప్రవేశపెట్టేందుకు ప్రారంభంగా సాలీనా 1.5 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన కొత్త ప్లాంటును ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఏడాది జనరిలో జరగనున్న ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో దీన్ని విడుదల చేస్తాం, అనతరం మార్చి నాటికి ఇది మార్కెట్సోకి అందుబాటులోకి వచ్చేలా చూస్తామ"ని అన్నారు.

కొత్త వెస్పా స్కూటర్ 125సీసీ ఇంజన్‌ను కలిగి ఉండి గేర్లు లేకుండా ఉంటుందని ఆయన చెప్పారు. స్కూటర్ విభాగంలోకి పునఃప్రవేశించేందుకు 30 మిలియన్‌ యూరోలను పెట్టుబడులను ప్రకటించామని, 2013 మధ్య భాగం నాటికి ఈ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యాన్ని సాలీనా 3 లక్షల యూనిట్లకు విస్తరిస్తామని రవి చోప్రా తెలిపారు. దేశీయ మార్కెట్లో విక్రయాలు ఊపందుకున్న తర్వాత ఎగుమతులపై దృష్టిసారించాలని కంపెనీ భావిస్తోంది.

More from DriveSpark

Article Published On: Wednesday, September 7, 2011, 10:17 [IST]
English summary
Piaggio, the Indian three wheeler manufacturer it would soon restart building scooters and will start it with the new Vespa. The new Vespa will be launched in March next year. Piaggio is also considering to enter the motorcycle segment.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+