మహా సర్కారుపై మండిపడిన బజాజ్ ఆటో ఎండి

దీనిపై బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "గుజరాత్ ప్రభుత్వంతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయించాల్సిందిగా నేను మా చైర్మన్ రాహుల్ బజాజ్‌ను కోరడం జరిగింది. ఈ భేటిలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనే అవకాశం ఉంది. పోర్టుకు సమీపంలో భూమి దొరికితే మేము చాలా సంతోషిస్తాము, ఇది మా ఎగుమతులకు ఎంతగానో ఉపయోగపడుతుంద"ని రాజీవ్ చెప్పారు.
మహారాష్ట్ర సర్కారు అనుసరిస్తున్న ప్రభుత్వ విధానాలపై రాజీవ్ బజాజ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 2010 నుంచి బజాజ్ ఆటో కంపెనీకు సేల్స్ టాక్స్‌ను రీఫండ్ చేయడంలో జాప్యం చేస్తూ వస్తుంది. ఇప్పటి వరకూ ప్రభుత్వం చెల్లించాల్సిన సేల్స్ టాక్స్ బకాయిలు రూ. 1,110 కోట్లుకు చేరుకున్నాయి. దీనిపై 'మహా' సర్కారు ఎలాంటి స్పష్టమైన వైఖరిని ప్రకటించకపోవడంతో బజాజ్ ఆటో తన విస్తరణ ప్రాజెక్టులను వేరే రాష్ట్రానికి మళ్లించాలని భావిస్తోంది.


Click it and Unblock the Notifications








