రవితేజ నిప్పు చిత్రంలో యమహా ఫేజర్ స్పోర్ట్స్ బైక్

Yamaha Fazer
మన మాస్ మహాజారా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం "నిప్పు". ఇది బొమ్మరిల్లు వారి పతాకంపై గుణశేఖర్ దర్శకత్వంలో వైవీఎస్ చౌదరి ద్వారా నిర్మితమవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన స్టిల్స్ తాజాగా విడుదలయ్యాయి. ఈ ఫోటోను గమనించారా..! ఇందులో మన మాస్ మహాజారా ఓ యమహా ఫేజర్‌ స్పోర్ట్స్ బైక్‌పై కూర్చుని ఎలా ఫోజులిస్తున్నాడో చూడండి.

వాస్తవానికి యమహా ఫేజర్ ఇండియా యమహా మోటార్ కంపెనీ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న స్పోర్ట్స్ బైక్. శక్తివంతమైన 153 సీసీ ఎయిర్-కూల్డ్, 4-సిలిండర్, ఎస్ఓహెచ్‌సి ఇంజన్‌‌తో లభిస్తున్న ఈ స్పోర్ట్స్ బైక్ పెర్ఫామెన్స్‌లో మిగతా 150 సీసీ బైక్‌లతో పోల్చుకుంటే ది బెస్ట్ అనిపించుకుంటుంది. సాటిలేని పికప్‌కు యమహా బైక్‌లు పెట్టింది పేరు.

ఇది 7500 ఆర్‌పిఎమ్ వద్ద 14 పిఎస్‌ల శక్తిని, 6000 ఆర్‌పిఎమ్ వద్ద 13.6 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. మిడ్-సస్పెన్షన్‌ (మధ్యలో ఉండే షాక్అబ్జార్వర్)తో ఇది మంచి రోడ్‌గ్రిప్‌ను కలిగి ఉంటుంది. ఈ బైక్‌లో ప్రధాన ఆకర్షణ, దీని ముందువై డిజైన్. హ్యాడింల్ బార్‌తో సంబంధం లేకుండా ట్యాంక్‌ను అంటిపెట్టుకుని ఉండే దీని ఫ్రంట్, రెండు హెడ్‌లైట్లతో ఎంతో ఆకర్షనీయంగా ఉంటుంది.

ఇది ముందువైపు డిస్క్ బ్రేక్, వెనుక వైపు డ్రమ్ బ్రేక్ ఆప్షన్‌తో లభిస్తుంది. దీని బరువు దాదాపు 141 కేజీలు. వెనుక వెడల్పాటి టైర్‌ (140/60-R17)ను కలిగి ఉండి మంచి రైడ్ కంఫర్ట్‌ను ఇస్తుంది. యమహా ఫేజర్ కాంపిటీషన్ వైట్, బ్లాక్ సైబర్ గ్రీన్, లావా రెడ్, మిడ్‌నైట్ బ్లాక్ అనే నాలుగు ఆకర్షనీయమైన రంగుల్లో లభిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధర రూ.74,000.

నిప్పు చిత్రంలో రవితేజ ఉపయోగించనది లావా రెడ్ కలర్ యమహా ఫేజర్. ఈ చిత్రంలో రవితేజతో పాటుగా డా. రాజేంద్రప్రసాద్, దీక్షాసేత్, ప్రదీప్ రావత్, పద్మశ్రీ బ్రహ్మానందం, కృష్ణుడు, ధర్మవరపు సుబ్రమణ్యం, ముకులు దేవ్, బ్రహ్మాజీ, సుప్రీత్‌లు ప్రధాణ తారాగణం. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. త్వరలోనే రవితేజ 'నిప్పు' ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from DriveSpark

Article Published On: Saturday, November 19, 2011, 16:16 [IST]
English summary
Tollywood actor Ravi Teja who is currently acting in Gunasekhar's Nippu is seen sitting on a Yamaha fazer in this picture. The Tollywood mass maharaja will be riding Yamaha's best selling sport bike in India in his forthcoming Sankranthi release.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+