హైదరాబాద్‌లో రిలయన్స్ ఆటోజోన్ స్టోర్ ప్రారంభం

Reliance Autozone
రిలయన్స్ రీటైల్ యొక్క ఆటోమోటివ్ రీటైల్ విభంగా "రిలయన్స్ ఆటోజోన్" ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త స్టోర్‌ను ప్రారంభించింది. హైదరాబాద్‌లోని దిల్‌షుఖ్ నగర్ ఏరియాలో, జానకీ నగర్ కాలనీ, టోలిచౌక్ మెయిన్ రోడ్ వద్ద 2,220 చ.అ. విస్తీర్ణంలో ప్రపంచ స్థాయి సదుపాయాలతో కంపెనీ కొత్త స్టోర్‌ను ప్రారంభించింది.

ఈ కొత్త స్టోర్‌లో కార్లు, బైకులకు సంబంధించిన యాక్ససరీలు, టైర్లు, బ్యాటరీలు వంటి ఐదు వేలకు పైగా ఆటోమొబైల్ విడిభాగాలు, 50కు పైగా అగ్రశ్రేణి విడిభాగాల కంపెనీల ఉత్పత్తులను అందించనుంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన తాజా స్టోర్‌తో దేశవ్యాప్తంగా తమ మొత్తం స్టోర్‌ల సంఖ్య 16కు పెరిగిందని కంపెనీ పేర్కొంది.

గుర్గావ్, జైపూర్, ఘజియాబాద్, జామ్నగర్, ముంబై వంటి పలు ప్రధాన నగరాల్లో రియలన్స్ ఆటోజోన్ స్టోర్‌లు ఉన్నాయి. ఈ స్టోర్లలో మినీ సెగ్మెంట్ నుండి ప్రిమీయం సెగ్మెంట్ వరకూ అన్ని వాహనాలకు అవసరమయ్యే విడిభాగాలు, యాక్ససరీలు లభ్యం కానున్నాయి.

యుటిలిటీ, ఆడియో, వీడియో, సేఫ్టీ, సెక్యూరిటీ, కార్ కేర్, రూఫ్ కేరియర్స్, రివర్స్ పార్కింగ్ సిస్టమ్, జిపిఎస్, రివర్స్ కెమెరా, సీటింగ్ మొదలగు యాక్ససరీలను ఈ స్టోర్‌ల ద్వారా పొందవచ్చు. పూర్తి కంప్యూటరైజ్డ్ బిల్లింగ్, ఆకర్షనీమైన మార్కెట్ ధరలకే నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తామని కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Thursday, December 15, 2011, 13:01 [IST]
English summary
Reliance Retail automotive retail arm Reliance Autozone has launched its automotive retail store in south India. Reliance Autozone store is located at Janaki Nagar Colony, Tolichowki Main Road Dilshuknagar, Hyderabad, Andhra Pradesh.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+