రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 750 సీసీ మోటార్‌సైకిల్!

Royal Enfield Chrome
బుల్లెట్ బైక్‌ల పట్ల మన భారతీయుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. రోడ్డుపై డుగ్.. డుగ్.. డుగ్.. మంటూ శబ్థం చేసుకుంటూ, గంభీరమైన లుక్‌తో వెళ్లే బుల్లెట్ బైక్‌లు చూపరుల దృష్టిని ఇట్టే ఆకట్టుకుంటాయి. వాస్తవానికి బుల్లెట్ సైలెన్సర్ బీటింగే ఆ మోడల్‌కు ప్రధాన ఆకర్షన అనిచెప్పవచ్చు. ఆ తర్వాత బుల్లెట్ విశిష్టమైన లుక్ కూడా. భారత్‌లోకి ఎన్ని విదేశీ ప్రీమియం బైక్‌లు ప్రవేశించినప్పటికీ బుల్లెట్ బైక్‌లకు పోటీగా నిలువలేక పోయాయి.

గడచిన 45 ఏళ్లుగా క్రూయిజ్ మోటార్‌సైకిళ్ల తయారీలో తనకంటూ ఓ ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్‌ను ఏర్పరుచుకున్న రాయల్‌ ఎన్‌ఫీల్డ్ నుంచి మరిన్ని కొత్త హై-ఎండ్ మోటార్‌సైకిళ్లు మార్కెట్లోకి రానున్నాయి. ఇప్పటి వరకూ దేశీయ మార్కెట్లో 300 సీసీ క్లాసిక్ బుల్లెట్ మోటార్‌సైకిల్ నుంచి 500 సీసీ క్లాసిక్ మోటార్‌సైకిల్ వరకూ వివిధ మోడళ్లను అందిస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ త్వరలోనే 750 సీసీ నుంచి 1,000 సీసీ ఇంజన్ సామర్థ్యం కలిగిన మోటార్‌సైకిళ్లను కూడా దేశీయ వినియోగదారులకు పరిచయం చేయనున్నట్లు సమాచారం.

ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంపై కంపెనీ ప్రతినిధిని సంప్రదించగా మాట్లాడేందుకు నిరాకరించారు. ప్రస్తుతం భారత్‌లో అందుబాటులో ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల ధరలు దాదాపు లక్షల రూపాయల పైమాటే. అలాగే, కొత్తగా రానున్న హెవీ సీసీ మోటార్‌సైకిళ్ల ధరలు కూడా దాదాపు రూ. 4 లక్షల నుంచి 7 లక్షల మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఇటీవలే రాయల్ ఎన్‌ఫీల్డ్ చెన్నై‌లో తన రెండో ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. బహుశా ఈ ప్లాంటులోనే రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త ఉత్పత్తులు తయారయ్యే ఆస్కారం కూడా ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, August 3, 2011, 17:18 [IST]
English summary
Royal Enfield is one motorcycle brand that has had a rich heritage and brand image. The Eicher Motors owned cruise bike manufacturer is now going up the power ladder by developing a 750cc and 1000cc motorcycles.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+