ఎన్‌ఫీల్డ్ నుంచి మరో రెండు ఉత్పత్తులు, చెన్నైలో రెండో ప్లాంట్

ఈమేరకు ఓరంగాండంలో ప్లాంటు నిర్మించుకునేందుకు ఐషర్ మోటార్స్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత అధికారికంగా స్థలాన్ని కేటాయించారు. దీనిపై ఐషర్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ సిద్ధార్థ్ లాల్ స్పందిస్తూ.. "రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఓ లేఖను అందుకున్నాం. భూమి మా స్వాధీనంలోకి వచ్చిన తక్షణమే నిర్మాణ పనులు పనులు ప్రారంభిస్తాం, 2013 తొలి త్రైమాసికం నాటికి ప్లాంటుతో మేము సిద్ధంగా ఉంటామ"ని తెలిపారు.
కొత్తగా ఏర్పాటు చేయబోతున్న ఈ ప్లాంటు ద్వారా రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్ల వెయిటింగ్ పీరియడ్ తగ్గించినట్లు అవుతుందని, ప్రస్తుతం వీటి వెయిటింగ్ పీరియడ్ 6-8 నెలలుగా ఉందని లాల్ చెప్పారు. కొత్త ప్లాంటు కోసం 350 కోట్లు రూపాయలను పెట్టుబడులుగా వెచ్చించనున్నామని, దీని ద్వారా 900 మందికి ప్రత్యక్ష మరియు పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడుతాయని ఆయన తెలిపారు. అలాగే, కొత్త ఉత్పత్తులపై దృష్టి సారించామని, 2011-13లో రెండు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడుతామని లాల్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 70,000 రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లు అమ్ముడుకాగలవని ఆయన అంచనా వేశారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో ఇవి 53,000 అమ్ముడయ్యాయి.


Click it and Unblock the Notifications








