అమ్మకానికి స్కూటర్స్ ఇండియా వాటాలు: రేసులో అతులో ఆటో

Lambretta Scooter
దివాళ తీసిన ప్రభుత్వ రంగ స్కూటర్ల తయారీ సంస్థ "స్కూటర్స్ ఇండియా లిమిటెడ్" (ఎస్‌ఐఎల్)ను పూర్తిగా విక్రయించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందుకు కేంద్ర క్యాబినెట్ కూడా పచ్చ జెండా ఊపింది. గడచిన 2002-03 ఆర్థిక సంవత్సరం నుంచి స్కూటర్స్ ఇండియా నష్టాల ఊబిలో కూరుకుపోయింది. మార్చి 2009లో కంపెనీ పూర్తిగా కార్యకలాపాలు నిలిపివేసింది. ఈ కంపెనీలో ప్రభుత్వానికి 95.38 శతాం వాటా ఉంది. మిగిలిన వాటాలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, కార్పొరేట్ సంస్థల వద్ద ఉంది.

కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రి అంబికా సోనీ ఈ విషయాన్ని వెల్లడించారు. స్కూటర్స్ ఇండియా కంపెనీలో ప్రభుత్వానికి ఉన్న 95 శాతం ఈక్విటీని అమ్మేయాలని నిర్ణయించామని, ఈ అమ్మకం పెట్టుబడుల ఉపసంహరణ శాఖ ద్వారా చేయనున్నామని ఆయన వివరించారు. ఏదో ఒక కంపెనీకి ఈ మొత్తం ఈక్విటీని అందించాలని అప్పటి వరకూ ఈ కంపెనీలో పనిచేస్తున్న వారికి జీతాలు, ఇతర ఖర్చులను ప్రభుత్వం భరించటానికి కూడా కేబినెట్‌ అనుమతించిందని సోనీ తెలిపారు.

బీఎస్‌ఈలో లిస్టయిన స్కూటర్స్ ఇండియా 2009-10 ఏడాదికి రూ. 22.03 కోట్ల నష్టాలను ప్రకటించింది. 1972లో ఇటలీ లాంబ్రెట్టా కంపెనీతో ఒప్పందం చేసుకొని విజయ సూపర్‌ బ్రాండ్‌ పేరుతో స్కూటర్‌లను ఉత్పత్తి చేసిన స్కూటర్స్‌ ఇండియా కంపెనీ విదేశాలకు కూడా స్కూటర్లను ఎగుమతి చేసింది. ఆ తర్వాతి కాలంలో సొంత టెక్నాలజీ విక్రాంత్ పేరుతో త్రిచక్ర వాహనాల (ఆటోలు) ఉత్పత్తిని చేపట్టింది. 1997 తరువాత స్కూటర్ల తయారీని పూర్తిగా నిలిపివేసి కేవలం ఆటోల ఉత్పత్తికి పరిమితమైంది.

అయితే ఇందుకు కావాల్సిన సామర్ధ్యం స్కూటర్స్ ఇండియా వద్ద లేకపోవడం, దానికి తోడు పాత టెక్నాలజీల వాడటం కారణంగా కంపెనీ మార్కెట్‌లో నిలదొక్కులేక పోవటంతో సిక్‌ ఇండిస్టీగా మారిపోయి దివాళా తీసింది. కాగా... ఈ వాటాలను కొనుగోలు చేసేందుకు రాజ్‌కోట్ కేంద్రంగా పనిచేస్తున్న అతుల్ ఆటో రేసులో ముందుంది. స్కూటర్స్ ఇండియా సామర్థ్యం, టెక్నాలజీలపై ఇన్వెస్ట్ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అతుల్ ఆటో డెరైక్టర్ విజయ్ కేడియా చెప్పారు.

More from DriveSpark

Article Published On: Friday, May 20, 2011, 14:41 [IST]
English summary
Cabinet approved to sale of government's stake in the loss-making Scooters India Ltd, with this cabinet approving, Rajkot-based three-wheeler maker Atul Auto said it is keen to acquire the entire stake in this PSU. In Scooters India Ltd company Government having 95.38% stake and other stake owned by banks, corporates etc.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+