నష్టాలను భర్తీ చేసుకోనున్న స్కూటర్స్ ఇండియా

Scooter
ప్రభుత్వ రంగ ఆటోమొబైల్ సంస్థ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఐఎల్)కు త్వరలోనే మంచి రోజులు వచ్చే సూచనలు నబడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర నష్టాలను మార్జినల్‌గా తగ్గించుకోవాలని లక్ష్యంగా నిర్ధేశించుకుంది. 2011-12లో నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకొని ఉత్పత్తిని పెంచుకోవడం ద్వారా నికర నష్టాన్ని రూ. 18.4 కోట్ల నుంచి రూ. 17.9 కోట్లకు తగ్గించుకోవాలని స్కూటర్స్ ఇండియా నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా కంపెనీ ఉత్పత్తి సామర్థ్యాన్ని 10 శాతానికి పెంచుకొని, నిర్వహణ వ్యయాన్ని 5 శాతానికి తగ్గించుకోనున్నట్లు కంపెనీ పేర్కొంది.

కంపెనీకు మరియు భారీ పరిశ్రమలు, ప్రజా సంస్థల యొక్క పరిపాలనా మంత్రిత్వ శాఖ మధ్య కుదిరిన సహకార ఒప్పందం ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల అమ్మకాలను 223.2 కోట్లకు పెంచుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. గడచిన ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ. 171.2 కోట్లుగా ఉన్నాయి. కాగా.. ఈ ఏడాది మే నెలలో స్కూటర్స్ ఇండియా కంపెనీలు ప్రభుత్వానికి ఉన్న 95 శాతం వాటాలను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇందులో మిగిలిన ఐదు శాతం వాటాలు బ్యాంకు, ఆర్థిక సంస్థలు మరియు కార్పేరేట్ల వద్ద ఉంది.

More from DriveSpark

Article Published On: Sunday, August 7, 2011, 14:22 [IST]
English summary
State-owned Scooters India Ltd (SIL) has set a target to cut its net losses marginally to Rs 17.9 crore in 2011-12 from Rs 18.4 crore in the last fiscal by reducing its operational cost and increasing the production.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+