స్కూటర్స్ ఇండియా ప్రైవటీకరణ చేస్తున్నాం..: కేంద్ర మంత్రి

గత ఆర్థిక సంవత్సరం (2009-10)లో కంపెనీ రూ. 22.03 కోట్ల నష్టాన్ని చవిచూసింది. దీంతో స్కూటర్స్ ఇండియాను పూర్తి స్థాయి ప్రైవేటీకరణ చేయడమే మంచిదని ప్రభుత్వం నిర్ణయించింది. స్కూటర్స్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వానికి 95.38 శాతం వాటా ఉంది. ఈ కంపెనీ సొంతంగా ఆటో ప్లాంట్‌ను కలిగి ఉండి, సాంప్రదాయ, సాంప్రదాయేతర ఇంధన ఆధారిత త్రిచక్ర వాహనాల డిజైనింగ్, డెవలపింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. కానీ ప్రస్తుతం ఈ కంపెనీ మూతబడి ఉంది.


Click it and Unblock the Notifications








