ఫోర్-స్ట్రోక్ స్కూటర్ 'సెలక్ట్'ను విడుదల చేసిన ఎల్ఎమ్ఎల్

LML
మన భారతీయులకు ఎల్‌ఎమ్ఎల్ స్కూటర్ల గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు. రవాణ వ్యవస్థం అంతంత మాత్రంగా ఉన్న రోజుల్లో మనకు స్కూటర్లే సూపర్‌బైక్‌లు. కాన్పూర్‌కు చెందిన ఎల్ఎమ్ఎల్ లిమిటెడ్ కంపెనీ 'సెలక్ట్' అనే ఫోర్-స్ట్రోక్ స్కూటర్‌ను దేశ రాజధానిలో విడుదల చేసింది. 148సీసీ ఆయిల్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో లభించే ఈ స్కూటర్ 6,200 ఆర్‌పిఎమ్ వద్ద 8.8 పిస్‌ల శక్తిని 4,250 ఆర్‌పిఎమ్ వద్ద 11.3 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది నాలుగు మ్యాన్యువల్ హ్యాండ్ గేర్స్ సిస్టమ్‌తో లభిస్తుంది.

సెలక్ట్ స్కూటర్ 5.5 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది, ఇందులోనే ఒక లీటర్ రిజర్వ్ ఉంటుంది. కిక్-స్టార్ట్ మరియు ఎలక్ట్రిక్-స్టార్ట్ ఆప్షన్లతో ఇది లభిస్తుంది. కిక్-స్టార్ట్ సెలక్ట్ స్కూటర్ ధర రూ. 47,140 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మరియు ఎలక్ట్రిక్-స్టార్ట్ సెలక్ట్ స్కూటర్ ధర రూ. 50,978 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది. సెలక్ట్ స్కూటర్‌ను జూన్ చివరి నాటికి పంజాబ్, హర్యానాస ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో కూడా అందుబాటులోకి తీసుకు రానున్నట్లు కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ పిఎస్ చౌదరి వెల్లడించారు. భవిష్యత్తులో మరిన్ని ఉత్పత్తులను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన వివరించారు.

More from DriveSpark

Article Published On: Friday, June 17, 2011, 16:22 [IST]
English summary
LML Limited, the Kanpur based company has launched Select 4 stroke scooter for the Delhi NCR territory. It comes with a 148cc, air cooled, single cylinder engine and with 4 gears. The engine is capable of generating a peak power of 8.8 PS at 6200 rpm and a peak torque of 11.3 Nm at 4250 rpm.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+