రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లాంటు తమిళనాడు వెళ్లడానికి కారణం..?

Royal Enfield
మన రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్ట్ కాస్తా పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోయింది. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్లుగా.. ఐషర్ మోటార్స్‌కు చెందిన ద్విచక్ర వాహన కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లాంటు మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆమోదం తెలిపినప్పటికీ.. దానిపై తుది నిర్ణయం తీసుకోవడంలో పరిశ్రమల శాఖ జాప్యం కారణంగా, పుణ్యకాలం కాస్తా పూర్తయి సదరు ప్లాంటు తమిళనాడుకు తరలిపయింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రాజెక్టు కల్పించాల్సిన రాయితీలు, ప్రోత్సాహకాలకు కిరణ్ కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌వీ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఆమోదం తెలిపినప్పటికీ ఐషర్ ప్లాంటును రాష్ట్రం సొంతం చేసుకోలేకపోయింది. తమకు కల్పించాల్సిన రాయితీలకు సంబంధించిన ఉత్తర్వులను మార్చి నెలాఖరుగాలోగా జారీ చేయాల్సిందిగా ఐషర్ మోటార్స్ కిరణ్ సర్కారును కోరింది.

కాగా... ఈ విషయంపై మే 26వ తేదీన ప్రభుత్వం ఓ జీవోను పాస్ చేసింది. ఈ ప్రాజెక్టుకు కిరణ్ కుమార్ రెడ్డి అంగీకారం తెలిపినప్పటికీ పరిశ్రమల శాఖ నుంచి స్పందన రాకపోవడంతో చిర్రెత్తిన ఐషర్ మోటార్స్ తమిళనాడు సర్కారును ఆశ్రయించింది. ప్రస్తుతం ఐషర్ మోటార్స్‌కు చెన్నైలో ఉన్న ప్లాంటుకు సమీపంలోనే కొత్తగా ఈ టూ-వీలర్ ప్లాంటును ఏర్పాటు చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఈమేరకు తమిళనాడు సర్కారు నుంచి ఆమోదాన్ని రాయితీలను కూడా పొందింది.

ఐషర్ మోటార్స్ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయదలుచుకున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌కిళ్ల తయారీ ప్లాంటుకు 80 ఎకరాల భూమి మరియు 50 శాతం వ్యాట్ రీఎంబర్స్‌మెంట్‌ను ఇవ్వాలని కిరణ్ కుమార్ సర్కారు నిర్ణయించింది. అంతేకాకుండా.. విద్యుత్ సబ్సిడితో పాటు కొత్త పారిశ్రామిక విధానం కింద రాయితీలు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. కానీ.. పరిశ్రమల శాఖ జాప్యంతో ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాజెక్టును కూడా కోల్పోయినట్లయింది.

More from DriveSpark

Article Published On: Thursday, July 14, 2011, 11:44 [IST]
English summary
Royal Enfield's second production plant could well have been set up in Andhra Pradesh. However the slack functioning of government officials despite approval by chief minister Kiran Kumar reddy meant Eicher Motors, the owner of Royal Enfield, decided set up its plant in Tamil Nadu. The Andhra government had completed nearly all steps necessary to provide land and subsidies to Eicher Motor. However when the government failed to respond to Eicher Motor's request too quickly complete the process, the company decided to move out and sought help from Tamil Nadu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+