సౌరశక్తితో నడిచే ఎయిర్ కండిషనర్‌తో ఇంధనం ఆదా!

వాస్తవానికి కారులో ఆగిఉన్నప్పుడు ఏసి నడవాలంటే తప్పనిసరిగా ఇంజన్ ఆన్‌లో ఉంచాల్సిందే. దీనివలన పెట్రోల్ కూడా వృధాగా ఖర్చు అవుతుంది. అయితే ఈ సమస్యలన్నింటికీ గుడ్‌బై చెబుతూ హాంగ్‌కాంగ్ పాలిటెక్నిక్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు సౌరశక్తి (సోలార్ పవర్) ద్వారా నడిచే ఎయిర్ కండిషనర్‌ను అభివృద్ధి చేశారు. దీన్ని ఏ కారులోనైన అమర్చుకోవచ్చు.
కారు చలనంలో ఉన్నప్పుడు ఇంజన్ ఆధారంగా పనిచేసే ఏసి, ఇంజన్‌ను ఆఫ్ చేసిన వెంటనే సోలార్ పవర్ ద్వారా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఫలితంగా కారు ఇంజన్ రన్నింగ్‌లో లేకపోయినప్పటికీ ఏసి నడుస్తూనే ఉండి, కారు లోపలి వాతావరణం ఎల్లప్పుడూ చల్లగా ఉండేంచుదుకు ఉపకరిస్తుంది. సోలార్ ప్యానెల్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ బ్యాటరీలో నిక్షిప్తమై అక్కడి నుండి ఏసికు సరఫరా అవుతుంది.


Click it and Unblock the Notifications








