భారత రోడ్లపై సూపర్‌బైక్‌లు అంత సురక్షితం కాదు!

Bike Accident
హైదరాబాద్‌లో జరిగిన భారత జట్టు మాజీ క్రికెట్ కెప్టెన్, మోరాదాబాద్ ఎమ్‌పి హజారుద్దీన్ తనయుడు అయాజుద్దీన్ రోడ్డు ప్రమాద సంఘటన ఒక్కసారిగా ఉలిక్కిపడేటట్లు చేసింది. సుజుకి జిఎస్ఎక్స్ ఆర్-1000 అనే సూపర్‌బైక్‌పై అయాజుద్దీన్ హైదరాబాద్‌ రోడ్లపై అత్యంత వేగంగా నడుపుతూ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.

వాస్తవానికి సూపర్‌బైక్‌లు మన భారదేశపు రోడ్లకు పెద్దగా సరిపోవు. అత్యంత శక్తివంతమైన ఇంజన్ కలిగి ఉండి, సుమారు గరిష్టంగా గంటకు 200-300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ సూపర్‌బైక్‌లను మన రోడ్లపై నడపటం కష్టం. నిత్యం రద్దీగా ఉండే మన దేశపు రోడ్లపై ఇలాంటి వాహనాలను నియంత్రించడం కూడా పెద్ద సమస్యే.

సూపర్‌బైక్‌లను రైడ్ చేయడానికి ప్రత్యేకమైన శిక్షణ మరియు నైపుణ్యం అవసరం. మన రాష్ట్రంలో ఇలాంటిదే మరో విచారకర సంఘటన గతంలో కూడా చోటుచేసుకుంది. ప్రముఖ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు తనయుడు కోటా వినయ ఆంజనేయ ప్రసాద్ కూడా ఓ సూపర్‌బైక్‌ను రైడ్ చేస్తూ ప్రమాదవశాత్తూ డివైడర్‌ను ఢీకొట్టి అక్కడికక్కడే మరణించిన సంగతి తెలిసిందే.

అంతర్జాతీయ కార్ ర్యాలీ డ్రైవర్ మరియు బైక్ రేసర్ గౌరవ్ గిల్ ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ.. "సూపర్‌బైక్‌లు గంటకు 300 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి. దీన్ని ఎవరైనా చేయొచ్చు. అయితే, సూపర్‌బైక్‌లు వెళ్తున్నంత వేగంగా వీటి పట్ల నైపుణ్యం పెరగడం లేదు, అత్యవసర సమయాల్లో వీటిని ఎలా అదుపు చేయాలో తెలుసుకోవడం విఫలమవుతున్నారు. అందుకే ప్రమాదాలు జరుగుతున్నాయ"ని అన్నారు.

సూపర్‌బైక్‌లు చిన్న సైజు రాకెట్ లాంటిదని, ఇన్‌టైమ్‌లో వీటిని ఎలా ఆపాలో తెలియకపోతే, రెప్పపాటులో అంతా ముగిసిపోతుందని గిల్ అన్నారు. ఇటువంటి ప్రమాదాలను అరికట్టేందుకు సూపర్‌బైక్‌లకు లైసెన్సులను నియంత్రించడం ఒక్కటే మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు.

More from DriveSpark

Article Published On: Monday, September 12, 2011, 13:21 [IST]
English summary
Superbikes are being sold at increasingly high numbers recently. However the number of accidents involving such bikes are also on the rise. The recent accident involving former cricketer Azzaruddin's son highlights the need to understand the necessity of superbikes on Indian roads. These Super bikes are designed to reach speeds of over 300 kilometres per hour but the Indian roads do not support such speeds. Further one needs to have sufficient skills and experience to handle super bikes. It is essential that authorities enforce licensing for drivers of super bikes.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+