హోండా ఆక్టివాకు పోటీ ఇవ్వడానికి సిద్ధమైన సుజుకి స్కైడ్రైవ్!!

Suzuki Skydrive
హోండా, సుజుకి కంపెనీలు ప్రస్తుతం భారత మార్కెట్లో గేర్‌లెస్ స్కూటర్ విభాగంలో ఆధిపత్యాన్ని చలాయిస్తున్న సంగతి తెలిసిందే. హోండా ఆక్టివా, సుజుకి యాక్సెస్‌లు ప్రస్తుతం టాప్ స్కూటర్లుగా ఉన్నాయి. అయితే ఆక్టివాకు లభించిన ప్రజాదరణ యాక్సెస్‌కు లేదు. పైగా హోండా చాలా కాలం క్రితం నుంచే స్కూటర్ విభాగంలో ఉండటంతో మార్కెట్లో గట్టి పోటీ ఇస్తుంది. దీంతో ఈ పోటీని తట్టుకొని అగ్రస్థానాన్ని చేరుకునేందుకు సుజుకి మరో కొత్త మోడల్‌ స్కూటర్‌తో మార్కెట్లోకి రానుంది.

గతేడాదిలో సుజుకి ఈ స్కూటర్‌ను విడుదల చేయనున్నట్లు గుసగుసలు వినిపించినా అవి నిజం కాలేకపోయాయి. అయితే ప్రస్తుత పరిస్థితులను గమనిస్తుంటే, దేశీయ ఆటోమొబైల్ రంగం జోరందుకోవడంతో ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా కొత్త స్కూటర్‌ను విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. కానీ ఇందుకు సంబంధించిన సమయాన్ని మాత్రం కంపెనీ వెల్లడించడం లేదు.

125 సీసీ ఇంజన్‌తో లభించే "సుజుకి స్కైడ్రైవ్" స్కూటర్ చూడటానికి స్టైలిష్‌గా ఉండి ఆక్టివా, యాక్సెస్‌ల కన్నా సన్నగా ఉంటుంది. పెద్ద చక్రాలు, స్పోర్టీ లుక్, అద్భుతమైన బాడీ గ్రాఫిక్స్, అందమైన హెడ్ ల్యాంప్ వంటి ఎన్నో ఆకర్షనీయమైన ఫీచర్లు దీని సొంతం. ఇక భారత మార్కెట్లో దీని ధర విషయానికి వస్తే.. ప్రస్తుతం యాక్సెస్ ధరల ప్రకారం చూస్తే. స్కైడ్రైవ్ రూ. 45,000 - రూ. 52,000 వరకూ ఉండే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, May 5, 2011, 16:18 [IST]
English summary
Two-wheeler maker Suzuki may introduce its new gearless scooter "Skydrive" in Indian market to compete Honda Activa. At present Honda Activa is ruling the Indian scooter segment. Suzuki is also offering 125cc scooter Access, but the Access falls no behind its competitor with ongoing success has surpassed that of the Activa.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+