సుజుకి ఇంట్రూడర్ ఎమ్800: జస్ట్ రూ.8.8 లక్షలు మాత్రమే..

Suzuki Intruder M800
తెలుగు డ్రైవ్ స్పార్క్ గతంలో ప్రచురించినట్లుగానే జపాన్‌కు చెందిన ప్రముఖ క్రూయిజ్ బైక్‌ల తయారీ సంస్థ సుజుకి ఓ సరికొత్త 800సీసీ మోటార్‌సైకిల్‌ను విడుదల దేశీయ వినియోగదారులకు పరిచయం చేసింది. ధనిక/సంపన్న వర్గాలను దృష్టిలో ఉంచుకొని 'ఇంట్రూడర్ ఎమ్800' సూపర్‌బైక్‌‌ను రూ.8.8 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)తో విడుదల చేసింది.

సరికొత్త క్రోమ్ ఫినిష్ కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్, సైడ్ ప్యానెల్స్, ఆకర్షనీయమైన అల్లాయ్ వీల్స్, వెడల్పాటి టైర్లు, శక్తివంతమైన ఇంజన్‌తో ఇది లభయమవుతుంది. ఈ సూపర్‌బైక్‌లో అమర్చిన 805 సీసీ వి-ట్విన్ పెట్రోల్ ఇంజన్ 53 పిఎస్‌ల గరిష్ట శక్తిని విడుదల చేస్తుంది. ఇంకా ఇందులో 5-స్పీడ్ గేర్ బాక్స్, ఫ్రంట్ ట్విన్ డిస్క్ బ్రేక్ సిస్టమ్ కూడా ఉన్నాయి.

దేశవ్యాప్తంగా ఉన్న ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, పుణే, అహ్మదాబాద్‌లతో పాటు మొత్తం 12 ప్రధాన నగరాల్లో ఈ సూపర్‌బైక్ లభ్యం కానుందని కంపెనీ పేర్కొంది. భారత మార్కెట్లోని ఎంట్రీ లెవల్ క్రూయిజ్ బైక్ సెగ్మెంట్లో చాలా అవకాశాలు ఉన్నాయని, ప్రపంచ స్థాయి బైకింగ్‌ను భారతీయ యువతకు పరిచయం చేయాలని భావిస్తున్నామని కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఉపాధ్యక్షుడు అతుల్ గుప్తా తెలిపారు.

భారత మార్కెట్లో సుజుకి ఇప్పటికే ఎమ్1800, జిఎస్‌ఎక్స్-ఆర్1000, బ్యాండిట్ 1200ఎస్, హయబుసా వంటి సూపర్‌బైక్‌లను అందిస్తోంది. విలాసవంతమైన టూ-వీల్ రైడింగ్ కోరుకునే వారికి, హైవేలపై అధిక దూరం ప్రయాణించాలనుకునే వారికి ఈ సరికొత్త ఇంట్రూడర్ ఎమ్800 బైక్ చక్కగా సూట్ అవుతుంది. సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతి కోసం దీని సీట్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. దీనికి సంబంధించిన మరిన్ని సాంకేతిక వివరాల కోసం తెలుగు డ్రైవ్ స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Tuesday, November 29, 2011, 10:52 [IST]
English summary
Japan based motorcycle firm Suzuki Motorcycle India, has launched its cruiser bike 'Intruder M800' with the price tag of Rs 8.88 lakh (ex-showroom Delhi).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+