న్యూ 'సుజుకి స్లింగ్‌షాట్' 125సీసీ బైక్ రివ్యూ

Suzuki Sling Shot
జపాన్‌కు చెందిన సుజుకి మోటార్ కార్పోరేషన్ అనుబంధ సంస్థ సుజుకి ఇండియా ఇటీవల మార్కెట్లోకి "సుజుకి స్లింగ్‌షాట్" అనే 125 సీసీ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ బైక్ చూడటానికి చాలా డీసెంట్‌గా ఉండి ఫస్ట్‌ లుక్‌లోనే చూపరులను ఆకట్టుకుంటుంది. ఇది పెద్ద ఇంధన ట్యాంక్‌ను కలిగి ఉండటంతో పాటు మంచి రోడ్‌గ్రిప్ కూడా ఉండటంతో దీనిపై రైడ్ చేయటం ఎంతో హాయిగా అనిపిస్తుంది. దీని హెడ్‌లైక్ కూడా బాగా ట్రెండీగా ఉండి, షార్ప్ కట్స్, అత్యుత్తమ సైలెన్సర్‌తో చూడటానికే కాకుండా రైడ్ చేయడానికి కూడా అద్భుతంగా ఉంటుంది.

స్లింగ్‌షాట్ వెనుక టైర్ మూడు ఇంచ్‌ల వెడల్పు ఉండటంతో 60 కిలోమీటర్ల వేగంతో రైడ్ చేసినా కూడా మంచి రోడ్‌గ్రిప్‌ను అందిస్తుంది. ఇదే విభాగంలో హోండా మోటార్ కంపెనీ ప్రవేశపెట్టిన "హోండా షైన్" వెనుక టైర్ వెడల్పు కేవలం 2.75 ఇంచ్‌లు మాత్రమే. టెక్నికల్‌గా చెప్పాలంటే.. 125 సీసీ బైక్స్ 4 స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉండి కేవలం 8.7 బిహెచ్‌పి (హార్స్ పవర్)ను మాత్రమే ఉత్పత్తి చేస్తాయి. ఇది ఒకరకంగా 125 సీసీ బైక్‌కు తక్కువనే చెప్పాలి. ఇక దీని గేర్ సిస్టమ్ విషయానికి వస్తే ఐదు గేర్లు (ఒకటి ముందుకు నాలుగు వెనుకకు) ఉంటాయి.

ఇందులో 125 సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో పాటు సుజుకీ పల్స్‌డ్-సెకండరీ ఎయిర్-ఇంజెక్షన్ సిస్టమ్‌ ఉండటం వల్ల పర్యావరణ కాలుష్యం ఉండదు. ఈ బైకు షార్ప్ లుక్‌తో తక్కువ బరువును కలిగి ఉండి అల్లాయ్ వీల్స్, ఫోక్స్ వీల్స్ వెరైటీలలో లభిస్తుంది. 125 సీసీ విభాగంలో కంపెనీ ఇదివరకే విడుదల చేసిన 125 సీసీ హీట్, 125 సీసీ జియస్ మోటార్‌సైకిళ్ల కన్నా ఇది మెరుగ్గా ఉంటుంది. ఇది నాలుగు రంగులలో లభిస్తుంది. స్లింగ్‌షాట్‌కు మరో ముఖ్యమైన అంశం ఏంటంటే మైలేజ్.. ఇది లీటరు పెట్రోలుకు 70 కిలోమీటర్లు మైలేజీని ఇస్తుంది. ఈ స్టైలిష్ బైక్ గురించి మరికొన్ని వివరాలు మీకోసం.....

ఇంజన్:
టైప్: ఎయిర్‌-కూల్డ్, 4స్ట్రోక్, 1 సిలిండర్, ఎస్ఓహెచ్‌సీ
సిలిండర్ల సంఖ్య: ఒకటి
బోర్ x స్ట్రోక్: 53.5 మి.మీ. x 55.2 మి.మీ.
సామర్ధ్యం: 124 సీసీ
కంప్రెషన్ నిష్పత్తి: 9.6:1
కార్బట్టర్: వీఎమ్18
స్టార్టింగ్: కిక్ స్టార్ట్, ఎలక్ట్రిక్ స్టార్ట్
గేర్స్: 5 (1 కిందకి నాలుగు పైకి)
క్లచ్: మల్టీ-వెట్ ప్లేట్ టైప్

ఛాసిస్:
ముందు సస్పెన్షన్: టెలిస్కోపిక్, కాయిల్ స్ప్రింగ్, ఆయిల్ డ్యాంప్డ్
వెనుక సస్పెన్షన్: స్వింగ్-ఆర్మ్, కాయిల్ స్ప్రింగ్, ఆయిల్ డ్యాంప్డ్
ముందు బ్రేకు: మెకానికల్, డ్రమ్ టైప్
వెనుక బ్రేకు: మెకానికల్, డ్రమ్ టైప్
ముందు టైరు పరిమాణం: 2.75 -18 42పి
వెనుక టైరు పరిమాణం: 3.00 -18 52పి

ఎలక్ట్రికల్:
స్పార్క్ ప్లగ్: ఎన్‌.జీ.కె.
బ్యాటరీ: కిక్ స్టార్ట్ & ఎలక్ట్రిక్ స్టార్ట్ 12వోల్ట్, 5ఆంప్
హెడ్ లైట్: 12 వోల్ట్ 35/35 వాట్
బ్రేక్ లైట్: 12 వోల్ట్ 21/5 వాట్
ఫుల్ ట్యాంక్: (రిజర్వ్‌తో కలిపి) 12.0 లీటర్లు
రిజర్వ్‌: 2.1 లీటర్లు

కొలతలు, పరిమాణం:
పొడవు: 2,035 మి.మీ.
వెడల్పు: 770 మి.మీ.
ఎత్తు: 1,075 మి.మీ.
వీల్‌బేస్: 1,265 మి.మీ.
గ్రౌండ్ క్లియరెన్స్: 160 మి.మీ.
బరువు: స్పోక్స్ మోడల్ 127 కేజీలు, అల్లాయ్ మోడల్ 128 కేజీలు

లభించే రంగులు:
1. యల్లో
2. బ్లాక్
3. ఆరెంజ్
4. రెడ్

ధరల శ్రేణి: రూ. 43,945 - రూ. 45,911 (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ)

మరి ఇంకెందుకు ఆలస్యం సమీప సుజుకి షోరూమ్‌కు వెళ్లి స్లింగ్‌షాట్‌ను టెస్ట్ డ్రైవ్ చేయండి.

Article Published On: Saturday, February 5, 2011, 11:39 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+