నవంబర్‌లో కొనసాగిన ద్విచక్ర వాహన కంపెనీల జోరు

Bike Sales
టీవీఎస్ అపాచీ, స్టార్ మోడళ్ల జోరు..:
చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న భారతదేశపు తృతీయ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ, గడచిన నవంబర్ నెల అమ్మకాలలో 12 శాతం వృద్ధిని సాధించి 175,535 యూనిట్లను విక్రయించింది. గడచిన సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ అమ్మకాలు 157,041 యూనిట్లుగా ఉన్నాయి. ఏప్రిల్ నంబర్ కాలానికి గానూ కంపెనీ మొత్తం అమ్మకాలు 13,41,106 యూనిట్ల నుండి 14,99,612 యూనిట్లకు పెరిగి 12 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయి. టీవీఎస్ అపాచీ, స్టార్ సిటీ మోటార్‌సైకిళ్లు కంపెనీ అమ్మకాలలో కీలక పాత్రను పోషించాయి.

హోండా నవంబర్ అమ్మకాలు రెట్టింపు:
దేశీయ ద్విచక్ర వాహన మార్కెట్లో నాల్గవ స్థానంలో ఉన్న జపాన్ ఆటో దిగ్గజం హోండా, నవంబర్ అమ్మకాలలో రెట్టింపు వృద్ధిని సాధించింది. గడచిన నెలలో కంపెనీ అమ్మకాలు 53.64 శాతం వృద్ధిని సాధించి 1,99,154 యూనిట్లను విక్రయించింది. గడచిన సంవత్సరం ఇదే సమయానికి కంపెనీ అమ్మకాలు 1,29,627 యూనిట్లుగా ఉన్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. మోటార్‌సైకిల్ అమ్మకాలు 32.82 శాతం వృద్ధిని సాధించి 60,025 యూనిట్ల నుండి 79,724 యూనిట్లకు పెరగగా, స్కూటర్ల అమ్మకాలు 71.59 శాతం వృద్ధిని సాధించి 69,601 యూనిట్ల నుండి 1,19,430 యూనిట్లకు పెరిగాయి.

యమహాను ముందుకు నడిపిన ఎ‌స్‌జెడ్, ఎఫ్‌జెడ్:

ఇకపోతే జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఇండియా యమహా మోటార్ ప్రై లి నంబర్ నెల అమ్మకాలు 29 శాతం వృద్ధిని సాధించి 39,162 యూనిట్లను విక్రయించింది. గడచిన సంవత్సరం ఇదే కాలంలో అమ్మకాలు 30,130 యూనిట్లుగా ఉన్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది వరుసగా పెరుగుతున్న అమ్మకాల వృద్ధి పట్ల తాము చాలా సంతోషంగా ఉన్నామని, తమ కంపెనీ అమ్మకాలు పెరగడానికి కొత్తగా ప్రవేశపెట్టిన వైజెడ్ఎఫ్-ఆర్15 వెర్షన్ 2.0, ఎఫ్‌జెడ్, ఎస్‌జెడ్ మోడళ్లు ఎంతగానో సహకరించాయని కంపెనీ డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) జున్ నకటా తెలిపారు.

More from DriveSpark

Article Published On: Saturday, December 3, 2011, 15:31 [IST]
English summary
Honda Motorcycle & Scooter India (HMSI) reported 53.64 per cent growth in its total sales for November at 1,99,154 units. TVS Motor Company reported 12 per cent growth in its total sales for November at 175,535 units compared to 157,041 units in the same month of the previous year. Japanese two-wheeler maker India Yamaha Motor Pvt Ltd closed November selling 39,162 units, up by 29 per cent as compared to November 2010 sales of 30,130 units.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+