క్లచ్ లేని బైక్ 'టివిఎస్ జైవ్' - సమీక్ష మరియు సాంకేతిక వివరాలు

కంపెనీ తొలిసారిగా రోటరీ గేర్ టెక్నాలజితో ఈ జైవ్ మోటర్‌సైకిల్‌ను రూపొందించింది. 110 సీసీ ఇంజన్‌తో లభించే ఈ బైక్ వాహనం ఏ గేర్‌లో ఉన్నా కూడా వెంటనే స్టార్ట్ చేయవచ్చు. ఇందులో మొట్టమొదటిసారిగా గేర్ ఇండికేటర్‌ను కూడా అమర్చారు. ఈ ఇండికేటర్ ద్వారా వాహనం నడిపే వ్యక్తి ఏ గేర్‌లో వెళ్తున్నారో వాటి వివరాలు ఇండికేటర్‌పై కనిపిస్తాయి.
టివిఎస్ జైవ్‌లో 'టి మాటిక్ ఇంజన్'ను బిగించారు. టి మాటిక్ టెక్నాలజీతో ఓ బైక్‌ను మార్కెట్‌లోకి తీసుకురావడం ఇండియాలో ఇదే ప్రథమం. ఎలక్ట్రిక్ మరియు కిక్ స్టార్ట్ ఆప్షన్‌తో లభించే జైవ్ మోటార్‌సైకిల్‌ను ఎంతో సౌకర్యవంతంగా ఉండేలా తీర్చిదిద్దారు. బైక్ సీటు కింద భాగంలో ఓ వాటర్ బాటిల్, డాక్యుమెంట్లు, చిన్న గొడుగు వంటి వస్తువులను స్టోర్ చేసుకునే ఏర్పాటు ఉంటుంది.
నిత్యం రద్దీగా ఉండే సిటీ రోడ్లపై క్లచ్, గేర్ మార్పిడి వంటి సమస్యలు లేకుండా ఈ బైక్‌పై సాఫీగా రైడ్ చేయవచ్చు. ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు క్లచ్, గేర్, యాక్సిలరేటర్లను అలైన్ చేసుకుంటూ బైక్‌ను రైడ్ చేయడం రైడర్‌పై ఒత్తిడిని పెంచుతుంది. అయితే, టివిఎస్ జైవ్ ఈ ఒత్తిడిని తగ్గించి బైక్ రైడింగ్‌లో ఓ సరికొత్త అనుభూతిని ఇస్తుంది.
సాధారణంగా గేర్లు ఉండే బైక్‌లు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద లేదా ట్రాఫిక్ జామ్‌లో ఆపాల్సి వచ్చినప్పుడు గేర్లను తగ్గించుకుంటూ రావలసి ఉంటుందని, కాని టివిఎస్ జైవ్ టాప్ గేర్‌లోనే ఆపవచ్చు మరియు అదే గేర్‌లో ఎలాంటి జర్క్ లేకుండా స్టార్ట్ చేసి సాఫీగా ముందుకు నడపవచ్చు. 105 కిలోల తక్కువ బరువుతో టివిఎస్ జైవ్ నియంత్రించడానికి అత్యంత సులువుగా ఉంటుంది.
టివిఎస్ జైవ్‌ను ఎవరైనా నడపగలిగేలా రూపొందించారు. తొలి బైక్ కొనాలనుకే వారు, కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వారికి ఇది చక్కగా సరిపోతుంది. బైక్ టాప్ గేర్‌లో ఉన్నప్పుడు కూడా ఇంజన్‌ను ఆపనవసం లేకుండా రైడింగ్‌ను స్మూత్‌గా మార్చేందుకు ఇందులో ఉండే యాంటినాకింగ్ మెకానిజం మరో అదనపు ఆకర్షణ. ఇది లీటరుకు లీటర్‌కు 60 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
టివిఎస్ జైవ్ సాంకేతిక వివరాల కోసం నెక్స్ట్ (NEXT)పై క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








