జూన్ నెలలో 14% పెరిగిన టీవీఎస్ మోటార్ కంపెనీ అమ్మకాలు

TVS Apache
పెట్రోల్ ధరలను చమురు కంపెనీలు ఒక్కసారిగా ఐదు రూపాయల మేర పెంచినప్పటికీ బైక్‌ల అమ్మకాలు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. స్పోర్ట్స్ బైక్‌లతో మైలేజ్‌నిచ్చే బైక్‌లను అందిస్తున్న ప్రముఖ ద్విచక్ర, త్రిచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ గడచిన నెలలో 14 శాతం వృద్ధిని కనబరిచింది. జూన్ 2011లో కంపెనీ మొత్తం 1,82,456 యూనిట్లను విక్రయించినట్లు పేర్కొంది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ విక్రయాలు 1,59,688 యూనిట్లుగా ఉన్నాయి.

ద్విచక్ర వాహన విభాగం:
జూన్ 2011 నెలలో ద్విచక్ర వాహన విక్రయాలు గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 14 శాతం వృద్ధి చెంది 156,685 యూనిట్ల నుంచి 178,633 యూనిట్లకు పెరిగాయి. ఇకపోతే స్కూటర్ల అమ్మకాలు 21 శాతం వృద్ధితో 36,742 యూనిట్ల నుంచి 44,281 యూనిట్లకు పెరిగాయి. మోటార్‌సైకిళ్ల అమ్మకాలు 66,452 యూనిట్ల నుంచి 69,859 యూనిట్లకు పెరిగాయి. దేశీయ మార్కెట్లో మొత్తం ద్విచక్ర వాహన అమ్మకాలు 11 శాతం పెరిగి 139,905 యూనిట్ల నుంచి 155,296 యూనిట్లకు పెరిగాయి.

ఎగుమతులు:
గత నెలలో కంపెనీ ఎగుమతులు 48 శాతం వృద్ధి చెందాయి. జూన్ 2011లో కంపెనీ మొత్తం 26,359 యూనిట్లకు పెరిగాయి. గతేడాది ఇదే సమయంలో ఇవి 17,782 యూనిట్లుగా ఉన్నాయి. అలాగే, గత జూన్ నెలలో ద్విచక్ర వాహన ఎగుమతులు 39 శాతం వృద్ధి చెంది 16,780 యూనిట్ల నుంచి 23,337 యూనిట్లకు పెరిగాయి.

త్రిచక్ర వాహనాలు:
జూన్ 2011లో కంపెనీ 3,822 త్రిచక్ర వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇవి 27 శాతం వృద్ధిని సాధించాయి. జూన్ 2010లో త్రిచక్ర వాహన అమ్మకాలు 3,003 యూనిట్లుగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

More from DriveSpark

Article Published On: Friday, July 1, 2011, 11:19 [IST]
English summary
A quantum increase in exports supported by strong domestic sales with robust contributions from all segments saw TVS Motor Company witnessing an increase of 14% in overall sales. The company recorded total sales of 182,456 units in June 2011 against 159,688 units in the corresponding month of the previous year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+