త్వరలో టీవీస్ నుంచి కొత్త మోటార్‌సైకిల్ మరియు స్కూటర్!!

TVS Teenz
చెన్నయ్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ విక్రయాలపై భారీ ఆశలు పెట్టుకుంది. 2011 సంవత్సరం ముగిసే నాటికి దేశీయ మార్కెట్లో రెండు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టి తద్వారా సంస్థ విక్రయాలను 14 శాతానికి పైగా పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది. "మార్కెట్ ఇప్పటికీ వృద్ధిని కనబరుస్తోంది, అంతేకాకుండా ఇది గతేడాదిలా లేదు. పరిశ్రమ 13-14 శాతం పెరిగే అవకాశాలున్నాయి. ఇదే సమయంలో మేము (టీవీఎస్) దీని కన్నా కొంచెం ఎక్కువగా వృద్ధిని సాధించే అంశంపై దృష్టి సారించామ"ని టీవీఎస్ మోటార్ అధ్యక్షుడు (మార్కెటింగ్) హెచ్ఎస్ గోయింది అన్నారు.

2010-11తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గానూ కంపెనీ 33.17 శాతం వృద్ధిని సాధించి 20,46,668 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసుకుంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 15,36,919 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. కేవలం ద్విచక్ర వాహన విభాగంలో సంస్థ అమ్మకాలు 31.86 శాతం వృద్ధి నమోదు చేసుకొని గతేడితో పోలిస్తే 15,21,939 యూనిట్ల నుంచి 20,06,808 యూనిట్లకు పెరిగాయి. ఈ ఏడాది చివరి నాటికి కంపెనీ రెండు కొత్త మోడళ్లను విడుదల చేయనుందని, అందులో ఒక మోటార్‌సైకిల్‌ను మరొక స్కూటర్‌ను ప్రవేశపెట్టనున్నట్లు గోయింది తెలిపారు. అంతకు మించిన వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.

గతంలో కంపెనీ భారత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి పునఃప్రవేశిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 50 ఎలక్ట్రిక్ స్కూటర్లను దేశంలోని వివిధ నగరాల్లో టీవీఎస్ ట్రైల్ రన్ నిర్వహిస్తోంది. వాటిలో కొన్ని ప్రస్తుతం ఉన్న మోడళ్లు ఉంటే మరికొన్ని కొత్త మోడళ్లు ఉన్నాయి. ఏప్రిల్ 2008లో టీవీఎస్ 'స్కూటీ టీన్జ్ ఎలక్ట్రిక్' అనే ఓ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది ఆ సమయంలో ఇవి ఏటా 40,000 యూనిట్లు అమ్ముడవుతాయని కంపెనీ అంచనా వేసింది. అయితే ఈ మోడల్‌కు మార్కెట్ స్పందన సరిగ్గా లేకపోవడంతో దీని ఉత్పత్తిని 2009లో టీవీఎస్ నిలిపివేసింది. అంతే కాకుండా ఎలక్ట్రిక్ త్రీవీలర్‌లను ప్రవేశపెట్టే అంశంపై కూడా కంపెనీ దృష్టి సారించినట్లు సమాచారం.

More from DriveSpark

Article Published On: Wednesday, June 8, 2011, 14:28 [IST]
English summary
Count's 3rd largest two-wheeler maker TVS Motor said it expects sales to grow by over 14% this fiscal and is gearing up to launch two new models toward the end of the calendar year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+