త్వరలో 4 కొత్త ఉత్పత్తులను విడుదల చేయనున్న టీవీఎస్!

Scooty Teenz
చెన్నైకు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ త్వరలో మూడు లేదా నాలుగు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న చీప్ అండ్ బెస్ట్ మోటార్‌సైకిల్ టీవీఎస్ స్టార్ స్పోర్ట్స్, హై-ఎండ్ వేరియంట్ స్పోర్ట్స్ బైక్ అపాచీలలో అప్-గ్రేడెడ్ వెర్షన్‌లను మరియు ఓ సరికొత్త స్కూటీని విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. అలాగే, గతంలో ప్రవేశపెట్టి మధ్యలోనే ఉత్పత్తిని నిలిపివేసిన తమ ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ టీన్జ్‌ను కూడా పునఃప్రవేశపెట్టాలని కంపెనీ భావిస్తోందని, ఇప్పటికే కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లతో కంపెనీ ట్రైల్ రన్ నిర్వహిస్తోందని మార్కెట్ వర్గాల సమాచారం.

మరోవైపు సంస్థ ఎగుమతులు పరిమాణాన్ని పెంచుకునేందుకు మరిన్ని దేశాలను తమ జాబితాలో చేర్చుకునే అంశంపై కంపెనీ దృష్టిసారిస్తోందని, అలాగే దేశీయ మార్కెట్లో కూడా 2011-12 ఆర్థిక సంవత్సరానికి గానూ 16 శాతం వృద్ధిని సాధించే లక్ష్యంతో ఉన్నామని టీవీఎస్ మోటార్ కంపెనీ అధ్యక్షుడు (మార్కెటింగ్) హెచ్ఎస్ గోయింది వెల్లడించారు. ఇందులో భాగంగా హోసూర్ మరియు హిమాచల్ ప్లాంట్లలో ఉత్పత్తిని పెంచనున్నట్లు ఆయన తెలిపారు. గడచిన ఆర్థిక సంవత్సరం(2010-11)లో కంపెనీ మొత్తం విక్రయాలు 32 శాతం పెరిగి 20.04 లక్షలుగా నమోదయ్యాయి. అంతకు ముందు ఏడాది ఇవి 15.19 లక్షల యూనిట్లుగా ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, July 4, 2011, 16:59 [IST]
English summary
Chennai-based two-wheeler maker TVS Motor Company is planning to launch three or four new products, mostly upgraded and variants of existing TVS Star Sports, Apache and a new Sooty, a report said.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+