నెలాఖరు నాటికి ఉత్పత్తుల ధరలు పెంచనున్న టీవీఎస్..!?

ఈ నేపథ్యంలో దేశీయ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రస్తుతం ముడి సరుకుల ధరలు, ఉత్పాదక వ్యయాల (ఇన్‌పుట్ కాస్ట్)పై సమీక్ష నిర్వహిస్తోంది. ఈ నెలాఖరు నాటికి ఉత్పత్తుల ధరల పెంపుపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ముడి సరుకుల ధరలు ఇప్పటికీ ఎక్కువగానే ఉన్నాయని, అవి తమపై తీవ్ర ప్రభావాలను చూపుతున్నాయని టీవీఎస్ మోటార్ కంపెనీ అధ్యక్షుడు (మార్కెటింగ్) హెచ్ ఎస్ గోయింద్ వెల్లడించారు.
ప్రస్తుతం ఈ అంశంపై సమీక్ష నిర్వహిస్తున్నామని, నెలాఖరు నాటికి ధరల పెంపుపై ఓ నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రతి త్రైమాసికంలో తమ వాహన ధరలను సమీక్షిస్తుంటామని, కంపెనీ మార్జిన్లు స్వల్పంగా పెరుగుతున్నాయని గోయింద్ చెప్పారు. ఈ ఏడాది జనవరిలో కూడా కంపెనీ అందిస్తున్న అన్ని రకాల వాహనాలపై 1-2 శాతం మేర ధలను పెంచిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా.. చెన్నయ్‌కు చెందిన ఈ ద్విచక్ర వాహన దిగ్గజం అపాచీ మోడల్ మరో సరికొత్త వేరియంట్‌ను ఆవిష్కరించింది. 180 సీసీ ఇంజన్ సామర్థ్యంతో భారత టూ-వీలర్ మార్కెట్లోనే తొలిసారిగా యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఎబిఎస్) టెక్నాలజీతో కూడిన "ఆపాచీ ఆర్‌టిఆర్ 180" బైక్‌ను టీవీఎస్ విడుదల చేసింది. దీని ధర (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) రూ. 78,880గా నిర్ణయించామని, ఇది తమ బ్రాండ్ విలువను మరింత పెంచగదలని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తుంది.


Click it and Unblock the Notifications








