మోటార్‌సైకిళ్లలో ఆటోమేటిక్ గేర్లు: టీవీఎస్ మోటార్

ఈ మేరకు 110సీసీ స్కూటర్, మోటార్‌సైకిల్ కోసం కంపెనీ అభివృద్ధి చేసిన లేటెస్ట్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఇంజన్‌ను టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రదర్శించింది. ఈ ఇంజన్లను 2013 ప్రధమార్థం నాటికి స్కూటర్లు, మోటార్‌సైకిళ్లలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ అధ్యక్షుడు (న్యూ ప్రోడక్ట్ డెవలప్‌మెంట్) వినయ్ హార్నె తెలిపారు. గడచిన ఆరేడేళ్ల నుండి టీవీఎస్ ఇంజనీర్లు ఈ కొత్త ఫ్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేయడంపై పనిచేస్తున్నారని ఆయన చెప్పారు.
ప్రస్తుతం ఉన్న మోడళ్లలో మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌లను ఆఫర్ చేస్తామని, వినియోగదారుని అభిరుచి మేరకు తాను ఈ ఉత్పత్తులను ఎంచుకోవచ్చునని, అలాగే ఈ టెక్నాలజీని 110సీసీ నుండి 250సీసీ ఇంజన్ వరకూ ఆఫర్ చేయవచ్చునని వినయ్ తెలిపారు. ప్రస్తుతానికి ఇది 110సీసీ ఇంజన్ మాత్రమేనని, ఒకవేళ 250సీసీ ఇంజన్ అభివృద్ధి చేయాల్సి వస్తే, అది సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications








