టీవీఎస్ స్కూటీ స్ట్రీక్ ఇప్పుడు సరికొత్త డిజైన్‌లో లభ్యం

చెన్నైకు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ అందిస్తున్న స్కూటీ బ్రాండ్ (ముఖ్యంగా అమ్మాయిల ఫేవరేట్ స్కూటర్ బ్రాండ్)లో అందిస్తున్న స్ట్రీక్ స్కూటర్‌ను అప్‌గ్రేడ్ చేసి కొత్త బాడీ గ్రాఫిక్స్, కొన్ని అధనపు ఫీచర్లను జోడించి తాజాగా మార్కెట్లోకి విడుదల చేసింది.
ఫ్రెష్ లుక్‌తో వస్తున్న ఈ స్కూటీ స్ట్రీక్ ధర రూ.39,225 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). కొత్త స్కూటీ స్ట్రీక్ బ్లాక్ పెయింట్ షేడ్‌తో కొత్త బాడీ గ్రాఫిక్స్‌ను కలిగి ఉంది. సౌకర్యవంతమైన సీటింగ్ పొజిషన్ కోసం సీట్ డిజైన్‌ను కూడా మోడిఫై చేశారు. మంచి రోడ్ గ్రిప్ కోసం స్కూటీ స్ట్రీక్‌లో వెడల్పాటి టైర్లను అమర్చారు.
స్కూటీ స్ట్రీక్‌లో అమర్చిన 90సీసీ ఇంజన్ 5 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది. ఇంకా ఇందులో మొబైల్ చార్జింజ్ కోసం పవర్ ప్లగ్ పాయింట్, లాకబిల్ గ్లవ్ బాక్స్, పెట్రోల్ ఫిల్లింగ్ కోసం ఇతర స్కూటర్ల మాదిరిగా ప్రతిసారి సీట్‌ను ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా ఉండే విధంగా స్కూటర్ ముందువైపే అమర్చిన ఫ్యూయెల్ క్యాప్ వంటి ఫీచర్లు కొత్త స్కూటీ స్ట్రీక్ సొంతం.


Click it and Unblock the Notifications








