ద్విచక్ర వాహనాలపై డిస్కౌంట్లు, ఉచిత ఆఫర్లు

TVS Star City
దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత భారత ద్విచక్ర వాహన మార్కెట్లో 'ఆఫర్లు' మరోసారి హల్ చల్ చేయనున్నాయి. కొత్త ద్విచక్ర వాహనాలపై నగదు ప్రోత్సాహకాలు, తక్కువ వడ్డీ రేట్లు వంటి పలు పథకాలతో కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఓవైపు ప్యాసింజర్ కార్ల మార్కెట్ తగ్గుదలను కనబరుస్తున్నప్పటికీ, ద్విచక్ర వాహన మార్కెట్ మాత్రం స్థిరంగా రెండంకెల వృద్ధి రేటుతో ముందుకు సాగుతోంది. మరోవైపు మార్కెట్లోకి వస్తున్న కొత్త మోడళ్లు బైక్ కంపెనీల మధ్య పోటీ వాతారణాన్ని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో డీలర్లు, తయారీదారులు ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా అందిస్తున్న బేసిక్ మోడల్, 110 సీసీ ఇంజన్ కలిగిన సిబి ట్విస్టర్‌పై ఎంపిక చేసిన మార్కెట్లలో రూ. 3,500 వరకూ కంపెనీ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. హీరో హోండా అందిస్తున్న స్ప్లెండర్ బైక్ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధర రూ. 41,350గా ఉండటంతో ఈ మోడల్‌కు పోటీ ఇచ్చేందుకు సిబి ట్విస్టర్ బైక్ ధరను హోండా తగ్గించింది. ప్రస్తుతం హోండా సిబి ట్విస్టర్ బైక్ ధర ఎక్స్-షోరూమ్ ఢిల్లీ రూ. 49,775గా ఉంది.

పెరిగిన ఇంధన ధరలు, పెట్రోల్ ధరలు టూ-వీలర్ మార్కెట్‌పై పెద్దగా ప్రభావం చూపలేదనే చెప్పాలి. ఇప్పటికీ ద్విచక్ర వాహన మార్కెట్ పటిష్టంగానే ఉందని, ప్రస్తుతం తాము ఎలాంటి ప్రోత్సాహకాలు ఆఫర్ చేయాల్సిన అవసరం కనబడటం లేదని బజాజ్ ఆటో మార్కెటింగ్ హెడ్ మిలింద్ బాడె అన్నారు. ఏదేమైనప్పటికీ.. కంపెనీ డిస్కవర్ బ్రాండ్‌లో అందిస్తున్న ఎంట్రీ లెవల్ వేరియంట్ డిస్కవర్ 100సీసీ బైక్‌పై మాత్రం 0% వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది.

ఇకపోతే టీవీఎస్ మోటార్స్ డీలర్లు కూడా 100సీసీ స్టార్ సిటీ బైక్‌పై ఇన్సూరెన్స్, రోడ్ టాక్స్ వంటి బెనిఫిట్లను ఆఫర్ చేస్తున్నారు. ముందున్నది పండుగ సీజన్ కావడంతో వివిధ ప్రాంతాలలో డీలర్లు గోల్డ్ కాయిన్, సిల్వర్ కాయిన్, లక్కీ డ్రా, గిఫ్ట్ ప్యాక్‌లు వంటి ఎన్నో ప్రోత్సాహకాలను అందించనున్నారు. కొత్త బైక్ కొనాలనుకునే వారు మరో రెండు నెల పాటు వేచి ఉండగలిగితే సరైన డీల్‌ను పొందడమే కాకుండా కొత్త వేరియంట్‌లను కూడా ఎన్నుకునే అవకాశం ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Monday, July 18, 2011, 12:27 [IST]
English summary
Two wheeler dealers are offering several freebies to attract buyers despite of the two wheeler market showing a two digit growth rate. Dealers are offering freebies to models such as the Hero Honda CB Twister, TVS Star City and the Bajaj 100cc Discover.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+