జూన్ నెలలోనూ కొనసాగిన ద్విచక్ర వాహన అమ్మకాల జోరు

Bajaj Sales
భారతదేశపు ద్వితీయ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో గడచిన జూన్ నెల విక్రయాలలో 16 శాతం వృద్ధిని సాధించినట్లు ప్రకటించింది. జూన్ 2011లో కంపెనీ విక్రయాలు 16 శాతం పెరిగి 366,657 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలానికి బజాజ్ ఆటో విక్రయాలు 315,422 యూనిట్లుగా ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ మొత్తం విక్రయాలలో కేవలం మోటార్‌సైకిల్ అమ్మకాలను గమనిస్తే అవి 14 శాతం వృద్ధి చెంది 282,408 యూనిట్ల నుంచి 322,827 యూనిట్లకు పెరిగాయి. ఇకపోతే కంపెనీ ఎగుమతులు 25 శాతం వృద్ధితో 114,024 యూనిట్ల నుంచి 142,124 యూనిట్లకు పెరిగాయి.

పెట్రోల్ ధరలు ఆకాశన్నంటుతున్న ద్విచక్ర వాహన విక్రయాల జోరు మాత్రం తగ్గడం లేదు. గత నెలలో హీరో హోండా 5,12,244 యూనిట్లను విక్రయించి 20.12 శాతం వృద్ధిని సాధించగా, చెన్నైకు చెందిన టీవీఎస్ మోటార్ కంపెనీ 1,78,633 యూనిట్లును విక్రయించి 14 శాతం వృద్ధిని హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్స్ ఇండియా 1,48,937 యూనిట్లను విక్రయించి 2.03 శాతం వృద్ధిని నమోదుచేసుకున్నాయి. కాగా.. జపాన్‌కు చెందిన యమహా మోటార్స్ జూన్ నెలలో 29.98 శాతం వృద్ధితో 36,595 యూనిట్లను విక్రయించగా, మహీంద్రా అండ్ మహీంద్రా టూవీలర్స్ విభాగం 11,748 యూనిట్లను విక్రయించి 16 శాతం వృద్ధిని సాధించాయి.

More from DriveSpark

Article Published On: Monday, July 4, 2011, 12:11 [IST]
English summary
India's two-wheeler sales in June were buoyant with Hero Honda reporting higher sales for the fourth consecutive month crossing 5 lack mark. Bajaj Auto reported a 16% jump in its June vehicle sales at 366,657 units. In the corresponding period a year ago, the company sold 315,422 units.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+