భారత రోడ్లపై పరుగులు పెట్టనున్న ట్రైయంప్ మోటార్‌సైకిళ్లు

జోషి నియామకం భారత్‌లో కంపెనీ విజయానికి సంబంధించిన తీవ్రతకు సూచకమని ఆయన అన్నారు. ట్రైయంప్‌లో చేరక ముందు జోషి రాయల్ ఎన్‌ఫీల్డ్ యూరోపియన్ కార్యకలాపాలు నిర్వహించేవారు. ఆసియా మరియు యూరప్‌లలో 16 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్నట్లు కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది. అయితే, భారత్‌లో ఉత్పత్తుల విడుదలకు సంబంధించి కంపెనీ ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. అలాగే, తమ బైక్‌లు పూర్తిగా దిగుమతి చేస్తుందా లేక భారత్‌లోనే అసెంబ్లింగ్ చేస్తుందా అనే విషయాన్ని కూడా కంపెనీ స్పష్టం చేయలేదు.
ట్రైయంప్ గతంలో దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో సంస్థలో వాటా కొనుగోలును లేదా అలయన్స్ పెట్టుకోవాలని ప్రయత్నించినప్పటికీ ఆ ఒప్పందం కుదరలేదు. 1902లో స్థాపించిన ఈ కంపెనీ విస్తృత స్థాయిలో బైక్‌లను అందిస్తోంది. వాటిల్లో 2.3 లీటర్ రాకెట్ III, స్పీడ్ ట్రిపుల్, డేటోనీ 675 మరియు ఇటీవలే విడుదల చేసిన టైగర్ 800 బైక్‌లు మంచి ప్రాచుర్యం పొందాయి. ట్రైయంప్ అందిస్తున్న వివిధ మోడళ్ల ధరలు బ్రిటన్‌లో 6,650 పౌండ్ల (దాదాపు రూ. 4.77 లక్షలు) నుంచి 12,650 పౌండ్ల (సుమారు రూ. 9 లక్షలు) వరకూ ఉన్నాయి.


Click it and Unblock the Notifications








