ఢిల్లీ ఆటో ఎక్స్‌‌పో 2012కి రానున్న బైక్‌లు స్కూటర్లు

Delhi Auto Expo
భారతదేశపు రాజధాని నగరంలో మరికొద్ది రోజుల్లో జరగనున్న 11వ అంతర్జాతీయ ఆటో ఎక్స్‌పోపై ప్రస్తుతం ఆటోప్రియులందరీ దృష్టి కేంద్రీకృతమై ఉంది. దేశవిదేశాలకు చెందిన వివిధ ఆటోమొబైల్ కంపెనీలు తమ కొత్త కొత్త ఉత్పత్తులను సరికొత్త కాన్సెప్ట్‌లను ఇక్కడ విడుదల చేయనున్నాయి. అంతేకాకుండా, ప్రముఖ ద్విచక్ర వాహనాల కంపెనీలు కూడా ఈ ఆటో షోలో తమ ఉత్పత్తలను ప్రదర్శనకు ఉంచనున్నాయి.

ఈ నేపథ్యంలో 11వ అంతర్జాతీయ ఆటో ఎక్స్‌పోలో దర్శనమివ్వనున్న బైక్ కంపెనీలు వివరాలు ఈ విధంగా ఉన్నాయి:

* బజాజ్ ఆటో
* ఫైర్‌ఫాక్స్ టూవీలర్స్
* హ్యార్లీ డేవిడ్‌సన్ ఇండియా
* హీరో మోటోకార్ప్
* హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రై లి.
* ఇండియా యమహా మోటార్ ప్రై లి.
* లోహియా ఆటో ఇండస్ట్రీస్
* మహీంద్రా టూవీలర్స్
* పియాజ్జియో వెహికల్స్ ప్రై లి.
* పోలారిస్
* సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రై లి.
* ట్రైయంప్ మోటార్‌సైకిల్స్ లిమిటెడ్
* టీవీఎస్ మోటార్ కంపెనీ

ఇకపోతే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో రెండు కంపెనీలు రిజిస్టర్ నమోదయ్యాయి, అవి..
* డూన్ స్కూటర్
* హీరో ఎలక్ట్రిక్

ఈ జాబితాను బట్టి గమనిస్తే.. బజాజ్ ఆటో నుండి అప్‌గ్రేడెడ్ పల్సర్, హీరో మోటోకార్ప్ నుండి మ్యాస్ట్రో స్కూటర్, హోండా మోటార్‌సైకిల్ నుండి సరికొత్త 100సీసీ బైక్, ఇండియా యమహా మోటార్స్ నుండి సరికొత్త స్కూటర్లు, మహీంద్రా టూవీల్స్ నుండి 350సీసీ మోజో బైక్, స్టాలియో బైక్, పోలారిస్ నుండి ఆఫ్-రోడ్ బైక్, ట్రయంప్ నుండి కొత్త సూపర్‌బైక్, టీవీఎస్ మోటార్ కంపెనీ నుండి సరికొత్త అప్‌గ్రేడెడ్ అపాచీ బైక్‌లు విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

అయితే, ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్న లోహియా ఆటో ఇండస్ట్రీ మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో రిజిస్టర్ చేసుకోవడాన్ని బట్టి గమనిస్తే, ఈ కంపెనీ కొత్త గేర్‌లెస్ స్కూటర్లను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే పియాజ్జియో కూడా వెస్పా స్కూటర్‌ను సరికొత్త హంగులతో పునఃప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ ఆటో ఎక్స్‌పో న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జనవరి 5-11 వరకూ జరగనుంది.

More from DriveSpark

Article Published On: Friday, December 16, 2011, 14:15 [IST]
English summary
11th International Delhi Auto Expo 2012 is around the corner. Here is the list of companies and their upcoming products in the Two-Wheeler category which includes both scooters.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+