మూడోసారి భారత్‌లోకి ప్రవేశించనున్న వెస్పా స్కూటర్

Vespa LX125
ఇటలీకు చెందిన ఆటోమొబైల్ సంస్థ వెస్పా అతిత్వరలోనే భారత ఆటో పరిశ్రమలోకి మరోసారి అడుగుపెట్టనుంది. స్కూటర్ల తయారీ తమదైన ముద్ర వేసుకున్న వెస్పా భారత్‌లోకి మూడోసారి ప్రవేశించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇందుకు గానూ వెస్పా అనుబంధ సంస్థ పియాగ్గియో మాహారాష్ట్రలోని స్కూటర్ ప్లాంటుకు తుది మెరుగులు దిద్దుతోంది. భారత్ మార్కెట్లో స్కూటర్లకు ఉన్న డిమాండ్ వెస్పాకు సుపరిచితమే. ప్రస్తుతం స్కూటర్ల తయారీలో టీవీఎస్, హోండాలు అగ్రస్థానాలలో ఉన్నాయి. 2012లో "వెస్పా ఎల్ఎక్స్125" పేరుతో 125 సీసీ ఇంజన్ సామర్థ్యం కలిగిన స్కూటర్‌తో వెస్పా భారత్‌లోకి ప్రవేశించనుంది.

వెస్పా ఎల్ఎక్స్ 125 విడుదల తర్వాత తమ స్వంత బ్రాండ్ పేరుతో ఉన్న అన్ని రకాల వాహనాలను పరిచయం చేయనుంది. వీటితో పాటు మోటార్‌సైకిళ్లు, ఇతర బ్రాండ్‌లను కూడా కంపెనీ విడుదల చేయనుంది. ప్రస్తుతం ఉన్న వెస్పా బ్రాండ్లలో ఏడు స్కూటర్లు, మోటార్‌సైకిళ్లు, చిన్న వాణిజ్య వాహనాలు ఉన్నాయి. భారత ద్విచక్ర వాహన మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపడానికి కంపెనీ ఇటీవల ప్రిమియం "అప్రిలియా" రేంజ్ సూపర్‌బైకును దిగుమతి చేసుకుంది. దీని ధరల శ్రేణి రూ. 13 లక్షల నుంచి రూ. 18 లక్షల మధ్య ఉంది.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఆప్రిలియా తమ బ్రాండ్ ఇమేజ్‌ను నిలబెడుతుందని, బెంగుళూరు, చెన్నయ్, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, పూణేలలోని డీలర్ల ద్వారా ఈ సూపర్‌బైక్ మార్కెటింగ్ చేయబడుతుందని పియాగ్గియో వెహికల్స్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. గత 2004లోనే ఆప్రిలియాను భారత ద్విచక్ర వాహన మార్కెట్లో ప్రవేశపెట్టాల్సి ఉండగా.. అది కాస్తా వాయిదా పడుతూ వచ్చింది. 2012 తొలి త్రైమాసికంలో వెస్పా ఎల్ఎక్స్ 125ను అధికారికంగా విక్రయిస్తామని కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Tuesday, January 25, 2011, 8:31 [IST]
English summary
Very soon, the Italian auto maker Vespa will launch its third entry into the Indian auto industry. The company’s apex body Piaggio is on the final touches to its scooter plant in Maharastra. Vespa is aware of the potential of scooter market and the dearth for its products. Currently the segment has two giants, TVS and Honda, and Vespa is coming out with its Vespa LX125 during 2012. After that the company will roll down a whole range of products under its own brands in addition to the motorcycles of other brands.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+