భారత మార్కెట్లో రీ-ఎంట్రీ ఇవ్వనున్న వెస్పా స్కూటర్స్

వెస్పా స్కూటర్లను విక్రయించేందుకు ఆసక్తి కలిగిన డీలర్లు ముందుకు రావాల్సిందిగా పియాజ్జియో ఓ పత్రికా ప్రకటనను ఇచ్చింది. అంతేకాకుండా.. ఇటలీకు చెంది ఈ స్కూటర్ల తయారీ సంస్థ 300 మిలియన్ యూరోలను పెట్టుబడిగా వెచ్చించి భారత్‌లో సాలీనా 1.5 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేయగల ఓ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. కొత్త వెస్పా ఎల్ఎక్స్125 డిజైన్‌లో పాతదనపు రుచిని పోనీకుండా, సరికొత్త హంగులతో మరియు ఫోర్ స్ట్రోక్ ఇంజన్‌ను కలిగి ఉండబోతుంది. ఇది గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.


Click it and Unblock the Notifications








