హ్యార్లీ డేవిడ్‌సన్‌కు పోటీ ఇవ్వడానికి సిద్ధమైన విక్టరీ మోటార్‌సైకిల్స్

సూపర్‌ లగ్జరీ, క్రూయిజర్స్ బైక్‌ల తయారీలో ప్రస్తుతం భారత్‌ మార్కెట్‌లో అగ్రగామిగా ఉన్న అమెరికాకు చెందిన హ్యార్లీ డేవిడ్సన్‌కు మరో గట్టిపోటీదారు దేశీయ మార్కెట్లోకి ప్రవేశించబోతుంది. ప్రస్తుతం దేశీయంగా ఉత్పత్తి ఉవుతున్న రాయల్ ఎనిఫీల్డ్, హ్యార్లీకు పెద్దగా పోటీ ఇవ్వలేకపోతున్న నేపథ్యంలో అమెరికాకు చెందిన మరో ద్విచక్రవాహన దిగ్గజం భారత గడ్డపై అడుగుపెట్టడానికి సన్నాహాలు ప్రారంభించింది. అమెరికాకు చెందిన "విక్టరీ మోటార్‌సైకిల్స్" తమ క్రూయిజర్స్‌తో వచ్చే ఏడాది దేశీయ మార్కెట్లో తమ సత్తాను నిరూపించుకునేందుకు సిద్ధమైంది.

ప్రస్తుతం విక్టరీ మోటార్‌సైకిల్ కంపెనీ లగ్జరీ టూరింగ్ బైక్స్, క్లాసిక్-స్టైల్ మోటార్‌సైకిల్స్, పవర్‌ఫుల్ ఇంటర్-స్టేట్ క్రూయిజర్స్‌లతో చాలా రకాల మోడళ్ల వాహనాలను ఉత్పత్తి చేస్తుంది. హ్యార్లీ డేవిడ్‌సన్ కనబరచిన వృద్ధిని పోటీగా తీసుకొని విక్టరీ కూడా తమ మార్కెట్‌ను విస్తరించుకునే పనిలో పడింది. ఈ క్యాలెండర్ ఇయర్‌లో హ్యార్లీ ప్రతి మూడు రోజులకు ఒకసారి రెండు యూనిట్లకు పైగా విక్రయాలను జరిపింది. హ్యార్లీ ప్రస్తుతం 12 మోడళ్ల సూపర్‌బైక్‌లను అందిస్తుంది.

వచ్చే ఏడాది ఢిల్లీలో జరగనున్న ఆటో ఎక్స్‌పో విక్టరీ మోటార్‌సైకిల్ తమ ఉత్పత్తులను ప్రదర్శన ఉంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు మార్కెట్ వర్గాల సమాచారం. హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిళ్ల ప్రారంభ ధరలు రూ. 5.5-7.5 లక్షల మధ్య ఉండగా.. విక్టరీ మోటార్‌సైకిళ్ల ప్రారంభ ధరలు (అమెరికా మార్కెట్లో) రూ. 5.68-1275 మధ్య ఉన్నాయి. హ్యార్లీ డేవిడ్‌సన్ హర్యానాలోని బవాల్‌లో ఉన్న మూడో ప్లాంటులో తమ బైకులను అసెంబ్లింగ్ చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, February 21, 2011, 10:57 [IST]
English summary
The US-based bike manufacturing company, Victory Motorcycles is all set to drive into the premium bike market in India with its all new cruisers next year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+